యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ఎదురుదెబ్బ..?

Posted By:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా నువ్వానేనా అంటూ పోటీపడుతున్న దిగ్గజ బ్రాండ్‌లు సామ్‌సంగ్, యాపిల్‌లు ఇక మీదట ఆసియా మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కోనున్నాయా..? స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఈ కంపెనీల భవిష్యత్ ఆసియా దేశాల్లో ఏ విధంగా ఉండబోతోంది..? యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ధీటైన జవాబిస్తోన్న 5 ప్రముఖ బ్రాండ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ఎదురుదెబ్బ..?

మైక్రోమాక్స్

భారతదేశంలో నెం.1 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించిన మైక్రోమాక్స్ తాజాగా తమ కార్యకలాపాలను రష్యా ఇంకా రోమానియన్ మార్కెట్లలోకి విస్తరించింది. ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు మైక్రోమాక్స్ సవాళ్లను విసురుతోంది.

 

యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ఎదురుదెబ్బ..?

కార్బన్

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న కార్బన్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీుటుగా స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తోంది.

 

యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ఎదురుదెబ్బ..?

ఓపో (చైనా):

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో ఇటీవల కాలంలో హాలీవుడ్ స్థాయి ప్రకటనలతో గొప్ప క్రేజ్‌ను సొంతం చేసుకుంది. విశిష్టమైన ఫీచర్లతో ఈ బ్రాండ్ ఫోన్‌లు ఆకట్టుకుంటున్నాయి.

 

యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ఎదురుదెబ్బ..?

జియోమీ (చైనా):

చైనా మార్కెట్లో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీగా అవతరించిన జియోమీని 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఆరవస్థానంలో ఉంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగించే జియోమీ అనతికాలంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. తాజాగా భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక టాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది.

 

యాపిల్, సామ్‌సంగ్‌లకు ఆసియా మార్కెట్లో ఎదురుదెబ్బ..?

జోలో (ఇండియా):

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడిప్పిడే విస్తరిస్తోన్న బ్రాండ్ జోలో. మైక్రోమాక్స్, కార్బన్ తరువాతి స్థానాల్లో నిలిచిన ఈ దేశవాళీ బ్రాండ్ తీవ్రమైన మార్కెట్ పోటీ నడుమ ముందుకు సాగుతోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన క్యూ3000 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి ప్రశంసలను అందుకుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung, Apple Under Threat from Asia: Top 5 Asian Smartphone Makers Climbing The Ladder. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot