‘శామ్‌సంగ్ బడా’ కుర్రకారుకి న్యూ ఇయర్ కిక్!!!

Posted By: Staff

‘శామ్‌సంగ్ బడా’ కుర్రకారుకి న్యూ ఇయర్ కిక్!!!

 

దుమ్ము రేపుతున్న యువతరాన్ని మరింత ఉర్రూతలూగించేందుకు మొబైల్ దిగ్గజం  శామ్‌సంగ్ ‘వేవ్ Y’ స్మార్ట్ ఫోన్‌ను డిజైన్ చేసింది. లేటెస్ట్ వోఎస్ బడా 2.0 పై ఈ డివైజ్ రన్ అవుతుంది. తక్కు వ పరిమాణం కలిగి నిక్కార్సైన పనితీరునందించే ఈ

హ్యాండ్‌సెట్,  సోషెల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో కొలువు తీరుతున్న కుర్రకారుకు ఫర్‌ఫెక్ట్ ఛాయిస్..

ఈ ఫోన్ బరువు 102 గ్రాములు, చేతిలో సౌకర్యవంతంగా ఇముడుతుంది. డిస్‌ప్లే పరిమాణం 3.2 అంగుళాలు (టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ స్వభావం), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, LED ఫ్లాష్ సౌలభ్యత, క్లారిటీతో కూడిన వీడియో రికార్డింగ్ సౌకర్యం, యాక్సిలరోమీటర్ అదేవిధంగా ప్రాక్సిమిటీ సెన్సార్ వ్యవస్థ.

ఈ డివైజ్‌కు మరో ప్లస్ పాయింట్  832 MHz ప్రాసెసర్, బడా 2.0 ఆపరేటింగ్ వ్యవస్థకు మరింత సపోర్టివ్‌గా నిలిచే ఈ ప్రాసెసర్ మొబైల్ పనితీరును మరింత సమర్థవంతం చేస్తుంది. పొందుపరిచిన జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫైలు ఇంటర్నెట్  వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. 570 గంటల స్టాండ్‌బై నిచ్చే 1200 mAh బ్యాటరీని మొబైల్‌లో దోహదం చేశారు. ఇంటర్నల్ మెమరీ 150 MB ముఖ్యమైన డేటాను పదిలపరుచుకునేందుకు దోహదపడుతుంది.

వాతావరణ సమాచారంతో పాటు ప్రధాన వార్తాంశాలసు డిస్‌ప్లే అయ్యే  విధంగా అప్లికేషన్లను ఫోన్లో నిక్షిప్తం చేశారు. ఏర్పాటు చేసిన శామ్‌సంగ్ మెసంజర్ వ్యవస్ధ ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ వంటి మల్టిపుల్ వోఎస్‌ల గల ఫోన్‌లతో చాట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ వ్యవస్థలు మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత ధృడపరుస్తాయి. మీడియా ప్లేయర్ మన్నికైన వినోదాన్ని సమకూరుస్తుంది.

ప్రస్తుత యువత కోరుకుంటున్న డిమాండ్‌లన్నింటిని ఈ  స్మార్ట్ ఫోన్‌లో సాకారం చేస్తూ, హుందాతనాన్ని పెంచేవిధంగా ‘శామ్‌సంగ్ వైవ్ Y’ రూపకల్పన జరిగింది.  ఇండియన్ మార్కెట్ ధర రూ.8,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting