సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను తెగ కొంటున్నారట..?

Posted By: Super

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను తెగ కొంటున్నారట..?

 

స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో బహుళజాతి సంస్థ సామ్‌సంగ్ అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటోంది. ఈ రంగంలో ఇప్పటి వరకు లీడర్‌గా ఉన్న నోకియా ఆధిపత్యానికి సామ్‌సంగ్ గండికొడుతోంది. ఆర్థిక రంగంలో మాంద్యం కారణంగా కన్జూమర్ డ్యూరబుల్ మార్కెట్ నీరసంగానే ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్‌లో సామ్‌సంగ్ మాత్రం తన అమ్మకాల జోరు పెంచుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఐటి ఉత్పత్తులు, వాషింగ్ మెషిన్లు, ఫ్లాట్ ప్యానెల్ టీవీలు, ఫ్రిజ్‌లు వగైరా ఉత్పత్తుల విక్రయాల్లో  రాణిస్తున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో దూకుడుగా దూసుకుపోవడానికి  ఎంచుకుంటున్న టెక్నాలజీతో పాటు అనుసరిస్తున్న వ్యూహాలే ప్రధాన కారణమని స్పష్టమవుతుంది. సామ్‌సంగ్ మొత్తం 13-14 మోడల్స్‌లో 50 రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. స్మార్ట్ ఫోన్ల శ్రేణిలో 7-8 ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు విండోస్ ఆధారిత మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot