శ్యామ్‌సంగ్ ‘హెచ్‌డీ’ ధమాకా..!!

ఈ వెబ్ సైట్లో పొందుపరిచిన సమాచారం మేరకు సరికొత్త 6 స్మార్ట్ ఫోన్లను శ్యామసంగ్ వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్యామ్‌సంగ్, ‘విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో’, ‘బడా సాఫ్ట్ వేర్ వ్యవస్థలతో’ రెండు అధునాత హ్యాండ్ సెట్లను విడుదల చేస్తున్నట్లు వెబ్ సైట్ పేర్కొంది.
అయితే శ్యామ్‌సంగ్ విడుదల చేయుబోతున్న రెండు ‘హెచ్ డీ’ హ్యాండ్ సెట్లకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 2.3.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకుంటున్న GT-5360, GT-i8150 మోడళ్లు వివిధ ఫీచర్లను కలిగి ఉన్నాయి. తొలిగా GT-5360లోని ఫీచర్లను పరిశీలిస్తే 3 అంగుళాల డిస్ ప్లే, 240 X 320 స్క్రీన్ రూసల్యూషన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఈ సెట్‌లో పొందుపరిచిన 2 మోగా పిక్సల్ కెమెరా నాణ్యమైన క్లారిటీ కలిగి ఉంటుంది. GT-i8150 ఫీచర్లను పరిశీలిస్తే 480 X 800 స్క్రీన్ రూసల్యూషన్ కలిగి, 1.4 GHz ప్రొసెస్సర్ తో రూపుదిద్దుకుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ కెమెరా హైఫర్ డెఫినిషన్ క్వాలటీతో కూడిన వీడియో రికార్డింగ్‌ను మీకు అందిస్తుంది.
శ్యామ్‌సంగ్ గెలక్సీ సిరీస్‌లో విడుదలైన హ్యాండ్ సెట్లు ప్రపంచ వ్యాప్తంగా హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సరీస్‌లో మరిన్నిమోడళ్లను విడుదల చేసేందుకు శ్యామ్‌సంగ్ యాజమాన్యం ప్రణాళిక రూపొందిస్తుంది. అంతేకాకుండా, త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లను రూపొందించేందుకు వ్యహరచన చేస్తున్నట్లు సమాచారం.
అయితే హెచ్‌డీ రిసల్యూషన్‌తో విడుదలకాబోతున్న ఆమోల్డ్ డిస్‌ప్లే (AMOLED) హ్యాండ్ సెట్లు, శక్తివంతమైన శ్యామ్‌సంగ్ ప్రొసెస్సర్ల కలయికతో సమర్థవంతమైన పనితీరును వినియోగదారునికి అందిస్తాయని విశ్లేషక వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








