నెట్‌లో హల్‌చల్ చేస్తున్న సామ్‌సంగ్ కొత్త టీజర్!

సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ 2013‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’ను పురస్కరించుకుని సరికొత్త వీడియో టీజర్‌ను వెబ్ ప్రపంచంలోకి తెచ్చింది. 18సెకన్ల నిడివితో రూపుదిద్దుకున్న ఈ టీజర్ ప్రపంచం ఓ కొత్త ఆవిష్కరణను చూడబోతోందన్న సంకేతాలను స్పష్టం చేస్తుంది. సాంకేతిక ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలకు వేదికగా ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్‌ను జనవరి 8 నుంచి 11 వరకు లాస్ వేగాస్‌లో నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ చేపట్టబోయే ఆవిష్కరణలకు సంబంధించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. గెలాక్సీ ఎస్4లో వినియోగించిన ఫ్లెక్సిబుల్ బ్యాటరీ అలాగే ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేను సామ్‌సంగ్ ఈ వేదిక పై ప్రదర్శించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పలు అనధికారిక నివేదికల ఆధారం సేకరించిన వివరాల మేరకు సామ్‌సంగ్ రేపటితరం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్ లు......
5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,
441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,
మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),
ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.


Click it and Unblock the Notifications








