శామ్‌సంగ్ ఛాంప్‌తో మీరే ఛాంపియన్!!

Posted By: Prashanth

శామ్‌సంగ్ ఛాంప్‌తో మీరే ఛాంపియన్!!

 

వివిధ నమూనాలలో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌లను లాంఛ్ చేసిన శామ్‌సంగ్ మరో ఆవిష్కరణకు నాంది పలికింది. డ్యూయోస్ సిరీస్ నుంచి ‘ఛాంప్ డీలక్స్’ మోడల్‌లో ప్రొఫెషనల్ డ్యూల్ సిమ్ ఫోన్‌ను శామ్‌సంగ్ డిజైన్ చేసింది. ఉన్నతమైన ఫీచర్లతో హుందా అయిన శైలిలో రూపుదిద్దుకున్న ఈ మొబైల్ మీ పాపులారిటీని పెంచుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉత్తమ ఫీచర్లతో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థతను ఒదిగి ఉన్న ‘శామ్‌సంగ్ ఛాంప్ డీలక్స్’ వినియోగదారుడి మొబైలింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది.

శామ్‌సంగ్ ఛాంప్ డీలక్స్ ప్రధాన ఫీచర్లు:

ఫోన్ డిస్‌ప్లే 2.8 అంగుళాల పరిమాణం కలిగి టీఎఫ్టీ టచ్ వ్యవస్థతో పనిచేస్తుంది. మొబైల్ వెనుక భాగంలో అమర్చిన కెమెరా 1.3మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి మన్నికైన ఫోటోగ్రఫీని ఉత్ఫత్తి చేస్తుంది. మైక్రో‌ఎస్డీ స్లాట్ ప్రక్రియ ద్వారా ఫోన్ ఎక్సటర్నల్ మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. నిక్షిప్తం చేసిన జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్ 3.0, యూఎస్బీ v2.0 కనెక్టువిటీ వ్యవస్థలు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్నిమరింత బలోపేతం చేస్తాయి . 2జీ నెట్‌వర్క్ సపోర్ట్. జీఎస్ఎమ్ సిమ్‌లు మాత్రమే ఫోన్‌లో పనిచేస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని పరిశీలిస్తే లోడ్ చేసిన ఆడియో, వీడియో ప్లేయర్ వ్యవస్థలు మన్నికైన పనితీరును కనబరుస్తాయి. ధర రూ.4,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot