సామ్‌సంగ్ చాంప్ vs నోకియా.. ఏది కొంటారు?

By Prashanth
|
Samsung Champ Neo Duos vs Nokia Asha 305


దేశీయ టెక్ మార్కెట్ అనేక మోడళ్లలో లభ్యమవుతున్నడ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లతో కళకళలాడుతోంది. పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు పోటాపోటీగా తమతమ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌‌లను విడుదల చేస్తున్నాయి. తాజగా, స్మార్ట్‌ఫోన్ నిర్మాణ రంగంలో దిగ్గజ కంపెనీలైన సామ్‌సంగ్, నోకియా‌లు తమతమ ప్రత్యేకతలతో రెండు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. ‘చాంప్ నియో డ్యుయోస్’, ‘ఆషా 305’ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ ఫోన్స్ స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ క్లుప్తంగా.....

బరువు ఇంకా చుట్టుకొలత:

చాంప్ నియో డ్యుయోస్: చుట్టుకొలత 96.9 x 54.3 x 13.5మిల్లీమీటర్లు, బరువు 82 గ్రాములు,

ఆషా 305: శరీర కొలత 110.3 x 53.8 x 12.8మిల్లీమీటర్లు, బరువు 98 గ్రాములు,

డిస్‌ప్లే:

చాంప్ నియో డ్యుయోస్: 2.4అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (QVGA రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

ఆషా 305: 3 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్),

ప్రాసెసర్:

చాంప్ నియో డ్యుయోస్: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆషా 305: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

కెమెరా:

చాంప్ నియో డ్యుయోస్: వీజీఏ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది.

ఆషా 305: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది.

స్టోరేజ్:

చాంప్ నియో డ్యుయోస్: 20ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఆషా 305: 10ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకనే సౌలభ్యత,

కనెక్టువిటీ:

చాంప్ నియో డ్యుయోస్: బ్లూటూత్, మైక్రో యూఎస్బీ 2.0,

ఆషా 305: బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ:

చాంప్ నియో డ్యుయోస్: 1000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (14 గంటల టాక్ టైమ్, 550 గంటల స్టాండ్ బై),

ఆషా 305: 1,110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (14గంటల టాక్ టైమ్, 528 గంటల స్టాండ్ బై),

ధర:

చాంప్ నియో డ్యుయోస్: రూ.3,260,

ఆషా 305: రూ.4,668.

తీర్పు:

సామ్‌సంగ్ చాంప్ నియో డ్యుయోస్‌లో ఏర్పాటు చేసిన స్టైలస్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ వంటి ప్రత్యేక ఫీచర్లు యూజర్‌కు మరింత లబ్ధి చేకూరుస్తాయి. సామ్‌సంగ్ చాట్ ఆన్, యాహూ, ఎమ్ఎస్ఎన్, జీటాక్, పుష్- మెయిల్, యాక్టివ్ సింక్,

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో మరింత దోహదపడతాయి. మరో వైపు నోకియా ఆషా 305, డ్యూయల్ సిమ్ అదేవిధంగా నలభై ఉచిత ప్రీమియమ్ ఈఏ గేమ్స్ వంటి ప్ర్తత్యేక ఫీచర్లతో వినియోగదారును కట్టిపడేస్తుంది. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి చాంప్ నియో డ్యుయోస్ ఉత్తమ ఎంపిక. పెద్ద డిస్‌ప్లే, ఉత్తమ క్వాలిటీ కెమెరా ఫీచర్‌ను కోరుకునే వారికి నోకియా ఆషా 305 బెస్ట్ చాయిస్.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X