అత్యాధునిక ఫీచర్స్‌తో శ్యామ్‌సంగ్ ఛాట్ ఫోన్స్

Posted By: Staff

అత్యాధునిక ఫీచర్స్‌తో శ్యామ్‌సంగ్ ఛాట్ ఫోన్స్

సాధారణంగా మొబైల్‌కి క్వర్టీ కీప్యాడ్ ఉంటే చాలా అందంగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. చాలా కంపెనీలు ప్రత్యేకంగా క్వర్టీ కీప్యాడ్ ఉన్న మొబైల్స్‌ని తయారు చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా శ్యామ్‌సంగ్ మొబైల్ కంపెనీ ఇటీవలే మరో రెండు కొత్త మొబైల్స్‌ని ఈ క్వర్టీ కీప్యాడ్ కోవలోకి విడుదల చేసింది. ఆ మొబైల్స్ ఏమిటంటే శ్యామ్‌సంగ్ ఛాట్ 222, శ్యామ్‌సంగ్ ఛాట్ 527. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు మొబైల్స్ కూడా కస్టమర్స్‌కి ఫేవరేట్ మొబైల్స్‌గా మారనున్నాయి.

ఈ రెండు మొబైల్స్ ఫీచర్స్‌ని ఒక్కసారి చూసినట్లైతే శ్యామ్‌సంగ్ ఛాట్ 222 డ్యూయల్ సిమ్ జిఎస్‌ఎమ్ సెల్ ఫోన్. ఇక శ్యామ్‌సంగ్ ఛాట్ 527 మాత్రం రెగ్యులర్ ఫోన్ అంటే సింగల్ సిమ్ సెల్ ఫోన్. ఇక శ్యామ్‌సంగ్ ఛాట్ 527 ప్రత్యేకత ఏమిటంటే ఛాట్ సిరిస్ మొబైల్స్‌లలో 3జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే మొబైల్. అంతే కాకుండా శ్యామ్ సంగ్ ఛాట్ 527 2.4 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉండి 240 x 320 పిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. అదే శ్యామ్‌సంగ్ ఛాట్ 222 మాత్రం 2.2 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు 176 x 220 పిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది.

శ్యామ్‌సంగ్ ఛాట్ 527 మాత్రం 2జీ, 3జీ నెట్ వర్క్స్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇక కమెరా విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ ఛాట్ 222 విజిఎ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్ లలో కూడా మొబైల్ ముందు భాగంలో ఎటువంటి కెమెరా లేకపోవడం వల్ల వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేయవు. రెండు మొబైల్స్ కూడా వినడానికి వినసొంపైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి. రెండు మొబైల్స్ తో పాటుగా 3.5 mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్నMp3/eAAC+ లాంటి ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. వీడియో విషయానికి వస్తే MP4/H.264 లాంటి ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్ లను రెండు మొబైల్స్ అందిస్తాయి. శ్యామ్‌సంగ్ ఛాట్ 222 వైర్ లెస్ ల్యాన్‌ని సపోర్ట్ చేయకపోయినప్పటికీ మిగిలిన ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తుంది. శ్యామ్‌సంగ్ ఛాట్ 222 మొబైల్‌తో పాటు ఇంటర్నల్ గా 43 MB మొమొరీ లభించగా మైక్ర్ ఎస్‌డి స్లాట్ ద్వారా 16 GB వరకు సపోర్ట్ చేయగా అదే శ్యామ్‌సంగ్ ఛాట్ 527 మొబైల్ తో పాటుగా 80 MB లభించగా మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32GB వరకు మొమొరీని విస్తరించుకునే వెసులుబాటు ఉంది.

ఇన్ని రకాల అత్యాధునిక ఫీచర్స్ ఉన్నటువంటి శ్యామ్‌సంగ్ ఛాట్ 222 ఖరీదు కేవలం రూ 3500 కాగా అదే శ్యామ్‌సంగ్ ఛాట్ 527 ఖరీదు మాత్రం కేవలం రూ 5000గా మార్కెట్ ధర నిర్ణయిండమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot