వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న శాంసంగ్.. మరో రెండు రోజుల్లో రెండు ఫోన్‌ల విడుదల..!
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఈ రెండు నెలల్లో అనేక హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S25 సిరీస్‌తోపాటు ఎంట్రీ, బడ్జెట్ రేంజ్ మోడల్స్‌లో 4 ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ F06 5G, గెలాక్సీ A06 5G, గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అయితే శాంసంగ్ నుంచి మరో కీలక ప్రకటన (Samsung Upcoming Smartphones in March 2025) వచ్చింది.
మార్చి నెలలో శాంసంగ్ A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు (Samsung A series Smartphones Launch Event) సంస్థ వెల్లడించింది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ లో ఈ పోస్ట్ చేసింది. మార్చి 2 న విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఏయే స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుందో వెల్లడించలేదు. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు ఓపెన్ చేసినట్లు తెలిపింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా శాంసంగ్ నుంచి గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూడు ఫోన్లు సరికొత్త డిజైన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ A55, గెలాక్సీ A35, గెలాక్సీ A25 ఫోన్‌లకు తర్వాత తరం వెర్షన్‌లుగా వచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ A56, A36, A26 మోడళ్లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు మూడు హ్యాండ్‌సెట్‌లు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ పరంగా A56, A36 మోడళ్లు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటాయని తెలుస్తోంది.
అదే A26 4565mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. చిప్‌సెట్‌ల విషయానికి వస్తే A56 హ్యాండ్‌సెట్ Exynos 1580, A36 మోడల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే A26 వేరియంట్ Exynos 1280 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్ రూ.28,000 ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ విడుదలపై స్పష్టత లేదు. A36 స్మార్ట్‌ఫోన్ రూ.32,999 ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే A56 హ్యాండ్‌సెట్ రూ.41,999 ధరకు లాంచ్ కానుందని తెలుస్తోంది.
భారత్ మార్కెట్‌లో నిన్న శాంసంగ్ రెండు 5G ఫోన్‌లను లాంచ్ చేసింది. గెలాక్సీ M16 5G ప్రారంభ ధర రూ.11499 గా ఉంది. అదే గెలాక్సీ M06 5G మోడల్ ధర రూ.9499 గా ఉంది. మార్చి తొలివారంలో ఈ రెండు ఫోన్‌ల సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








