ఇక మీదట 3జీ మొబైల్స్ కాదు.. 4జీ పరంపర..!!

Posted By: Super

ఇక మీదట 3జీ మొబైల్స్ కాదు..  4జీ పరంపర..!!

ఇండియాలోకి 3జీ వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు కొత్త కొత్త 3జీ మొబైల్స్‌తో హొరెత్తించారు. రోజు రోజుకీ టెక్నాలజీ మారుతున్న సందర్బంలో అన్నింటిలోను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ మార్కెట్లోకి 4జీ మొబైల్స్ వస్తున్నాయి. 4జీ మొబైల్స్‌లలో శ్యామ్‌సంగ్ కంపెనీ నుండి శ్యామ్‌సంగ్ కాంక్వర్ 4జీ, ఎల్‌జీ కంపెనీ నుండి ఎల్‌జీ రివల్యూషన్ 4జీ మొబైల్స్‌ని మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రెండు మొబైల్స్ కూడా టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీలో నూతన అధ్యయనాన్ని సృష్టించడానికి వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం మూడవ జనరేషన్ ఫీచర్స్‌ని మాత్రమే చూడడం జరిగింది. నాల్గవ జనరేషన్లో ఉండేటటువంటి మరిన్ని కొత్త ఫీచర్స్‌ని ఈ రెండు మొబైల్స్ కూడా మొబైల్ ప్రియులకు పరిచయం చేయనున్నాయి.

శ్యామ్‌సంగ్ కాంక్వర్ హై స్పీడ్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. అంతేకాకుండా 1 GHz పవర్ పుల్ ప్రాసెసర్‌ని కలిగి ఉండి యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకుగాను 3.5 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. శ్యామ్‌సంగ్ కాంక్వర్ రెండు కెమెరాలను కలిగి ఉంది. వెనుక భాగాన 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చూడచక్కని ఇమేజిలను, వీడియోలను తీయవచ్చు. ఇక ముందు భాగన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందిస్తుంది. మొబైల్‌తో పాటు కొన్ని ప్రీ లోడెడ్ అప్లికేషన్స్ రావడమే కాకుండా స్ప్రింట్ ఐడి అమర్చబడింది. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏమిటంటే గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్ నుండి కొత్త అప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఎల్‌జీ రివల్యూషన్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వి2.2 ప్రోయోతో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ పోన్. 1 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకుగాను 4.3 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సోంతం. శ్యామ్‌సంగ్ కాంక్వర్ అందించేటుటవంటి కనెక్టివిటీ ఫీచర్స్ బ్లూటూత్ 3.0, వై-పై 802 లాంటి వాటిని ఎల్‌జీ రివల్యూషన్ కూడా అందిస్తుంది. సాధారణంగా అత్యాధునికమైన మొబైల్స్‌లలో కనిపించేటుటవంటి micro-HDMI ఫీచర్ మొబైల్ కుడివైపున అమర్చబడింది.

మల్టీమీడియా, ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట చేస్తాయి. ఇక మొమొరీ స్టోరేజి విషయానికి వస్తే మొబైల్స్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీ రాగా, మొమొరీని 32జిబీ వరకు ఎక్పాండ్ చేసేందుకుగాను మైక్రో ఎస్‌డి స్లాట్ ఇందులో అమర్చబడింది. శ్యామ్‌సంగ్ కాంక్వర్ కంటిన్యూగా వాడితే 6 గంటల పాటు బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందిస్తుంది. అదే స్టాండ్ బై టైమ్ మాత్రం 230 గంటలు.

ఎల్‌జీ రివల్యూషన్ మొబైల్ కూడా కంటిన్యూగా వాడినట్లైతే 435 మినిట్స్ రాగా, అదే స్టాండ్ బై టైమ్ మాత్రం 335 గంటలుగా వస్తుందని నిపుణులు తెలిపారు. రెండు మొబైల్స్ ధరలను గనుక చూసినట్లైతే శ్యామ్‌సంగ్ కాంక్వర్ మొబైల్ ధర ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు. అదే ఎల్‌జీ రివల్యూషన్ ధర మాత్రం రూ 35,000గా నిర్ణయించడమైంది. త్వరలోనే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఈ రెండు మొబైల్స్ రానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot