మల్టీమీడియో ఫోన్స్ శ్యామ్‌సంగ్ డార్ట్, హెచ్‌టిసి సెన్సేషన్

Posted By: Staff

మల్టీమీడియో ఫోన్స్  శ్యామ్‌సంగ్ డార్ట్, హెచ్‌టిసి సెన్సేషన్

స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్‌కు శ్యామ్‌సంగ్, హెట్‌టిసి రెండు ప్రసిధ్ది. మొబైల్ ఇండస్ట్రీలో క్వాలిటీ విషయంలో కానీ, సర్వీస్‌ విషయంలో కానీ ఈ రెండు కంపెనీలు పెట్టింది పేరు. ఇండియాలో మంచి కస్టమర్స్ వీరి సొంతం. ప్రస్తుతం ఇండియాలో ఉన్న యూత్ ఎవరైతే సోషల్ మీడియా, మల్టీమీడియాకి బాగా ఆకర్షితులవుతున్నారో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోని ఈ రెండు కంపెనీలు కూడా అత్యున్నతమైన ఫీచర్స్‌తోటి స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేశాయి. ఒక కంపెనీ మిడిల్ క్లాసు కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోగా, మరోక కంపెనీ హై ఎండ్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని మొబైల్స్‌ని విడుదల చేస్తున్నాయి.

ఇందులో భాగంగా శ్యామ్‌సంగ్ 'డార్ట్' అనే సరిక్రొత్త స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొని రావడానికి సన్నాహాలు చేస్తుంది. శ్యామ్‌సంగ్ 'డార్ట్' ఆండ్రాయిడ్ ప్రోయో 2.2 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ గూగూల్ మొబైల్ ఇంటిగ్రేషన్‌తో నిక్షిప్తమై ఉంది. ఇంటర్నెట్ ఉపయోగించడానికి కూడా చాలా ఫాస్ట్‌గా పని చేస్తుంది. ఇక హెట్‌టిసి విషయానికి వస్తే హెట్‌టిసి కూడా తన అమ్ముల పోది నుండి హెట్‌టిసి సెన్సేషన్ అనే స్మార్ట్ పోన్‌ని విడుదల చేసింది. హెచ్‌టిసి సెన్సేషన్ కూడా అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే రన్ అవుతుంది. దీని గురించి కంపెనీ వివరిస్తూ మల్టీమీడియా ఫీచర్స్ బాగా ఎక్కవగా ఉన్న మొబైల్‌గా దీనిని పరిగణించారు.

హెచ్‌టిసి సెన్సేషన్ స్క్రీన్ సైజు 4.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉండగా అదే శ్యామ్‌సంగ్ డార్ట్ మాత్రం 3.14 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. హెట్‌టిసి సెన్సేషన్ అనేది మల్టీమీడియా ఫోన్. హై డెఫినేషన్ స్క్రీన్ సైజు దీని సొంతం. హెడ్ ఫోన్స్ కోసం ఎస్‌ఆర్‌ఎస్ టెక్నాలజీ, అదే వైర్ లెస్ స్ట్రీమింగ్ కోసం DLNA టెక్నాలజీని ఇందులో వాడడం జరిగింది. మార్కెట్లో ఉన్న అన్ని రకాలైన వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక శ్యామ్‌సంగ్ డార్ట్ విషయానికి వస్తే ఇది అసలు హై ఎండ్ మల్టీమీడియో మొబైల్ కాదు. ఐతే ఇందులో కూడా ఆడియో, వీడియో ప్లేయర్స్‌ని పోందుపరచడం జరిగింది. చక్కని ఆడియో, వీడియో కోసం 3.5 mm ఆడియో జాక్‌ని కూడా దీనితోపాటు ఇవ్వడం జరుగుతుంది.

హెట్‌టిసి సెన్సేషన్ 1జిబి ఇంటర్నల్ మొమొరి కార్డుతో పాటు, ఎక్స్ పాండబుల్ మొమొరీ కోసం మైక్రో ఎస్‌డి కార్డు కూడా ఇందులో పోందుపరచడం జరిగింది. శ్యామ్‌సంగ్ డార్ట్‌లో మాత్రం ఇంటర్నల్‌గా 512MB మొమొరీ కార్డు ఉండగా, ఎక్స్ పాండబుల్ మొమొరీ మాత్రం 2జిబి స్టాండర్ట్‌గా ఉంటుంది. ఐతే దీనిని 32జిబి వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. శ్యామ్‌సంగ్ డార్ట్‌లో 3 మెగా ఫిక్సల్ కెమెరా ఉండగా, హెచ్‌టిసి సెన్సేషన్‌లో మాత్రం 8 మెగా ఫిక్సల్ కెమారా ఉంది. అంతేకాకుండా కెమెరాకు ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం.

HTC Sensation, Samsung Dart రెండు కూడా సోషల్ నెట్ వర్కింగ్ మొబైల్స్. సెన్సేషన్ మాత్రం ఫేస్‌బుక్, ట్విట్టర్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఐతే శ్యామ్‌సంగ్ మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ కి గూగుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. రెండు మొబైల్స్ కూడా USB, WLAN కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. ఇక ఖరీదు విషయంలో కూడా రెండు మొబైల్స్ కూడా చాలా తేడా ఉన్నాయి. శ్యామ్‌సంగ్ డార్ట్ ధర కేవలం రూ 16,000కాగా అదే హెచ్‌టిసి సెన్సేషన్ ధర మాత్రం దీనికి డబుల్‌గా ఉంటుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot