శాంసంగ్ దివాళి సేల్, గెలాక్సీ ఫోన్లను భారీ తగ్గింపుతో అందుకోండి

By Gizbot Bureau
|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు కొనుక్కోవాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. దీపావళి పండుగను పురస్కరించుకుని శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు అయిన గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎస్10లపై సంస్థ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ చేస్తోంది. గెలాక్సీ నోట్ 10పై రూ.12 వేలు, ఎస్10పై రూ.14 వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్టు శాంసంగ్ తెలిపింది. కాగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ రెండు ఫోన్ల కొనుగోలుపైనా రూ.9990 విలువైన శాంసంగ్ గెలాక్సీ బడ్స్‌ను రూ.3 వేల డిస్కౌంట్‌తో రూ.6,990కే అందిస్తోంది. అలాగే, రూ.19,990 విలువైన గెలాక్సీ వాచ్ యాక్టివ్‌పై రూ.6 వేల రాయితీ లభించనుంది. గెలాక్సీ ఎస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్, రూ.5 వేల తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ నోట్ 10పై రూ.6 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్, ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.6 వేల క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు శాంసంగ్ తెలిపింది. దీంతో పాటుగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డెబిట్, క్రెడిట్ కార్డు మీద ఈఎంఐ ఆఫర్లు వంటివి ఉన్నాయి. మేక్ మై ట్రిప్ లో 25 శాతం తగ్గింపుతో ట్రావెల్ చేయవచ్చు. ఆఫర్లను ఓ సారి పరిశీలిద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్30ఎస్
 

శాంసంగ్ గెలాక్సీ ఎమ్30ఎస్

ఈ ఫోన్ కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్లో రూ.13,999 ధరతో కోట్ అవుతోంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారు ఓయో హోటల్ బుకింగ్స్ లో వేయి రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్

ఈ ఫోన్ తగ్గింపు ధర ఎంతనేది తెలియనప్పటికీ భారీగానే తగ్గింపును అందుకోబోతోంది. అలాగే కంపెనీ పలు రకాల ఆఫర్లను ఈ ఫోన్ మీద అందుబాటులో ఉంచింది.

శాసంగ్ గెలాక్సీ ఎ50

శాసంగ్ గెలాక్సీ ఎ50

శాంసంగ్ అఫిషియల్ వెబ్ సైట్లో దీని ధర రూ. 21,490గా ఉంది. ఇది 6జిబి ర్యామ్ వేరియంట్ ధర. అలాగే 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 18,490గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10

ఈ ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు దాదాపు రూ. 8 వేల వరకు తగ్గింపును అందుకుంటారు. అలాగే రూ. 6 వేల వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20ఎస్
 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20ఎస్

ఈ ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు దాదాపు రూ. 8 వేల వరకు తగ్గింపును అందుకుంటారు. అలాగే రూ. 6 వేల వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫోన్‌పై అత్యధిక రాయితీ లభించనుంది. దీని అసలు ధర రూ. 62,500 కాగా, ఇప్పుడు దీనిని 29,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే.. ఏకంగా రూ.32,501 రాయితీ అన్నమాట. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా కచ్చితంగా రూ.14,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. గెలాక్సీ ఎస్9లో శాంసంగ్‌కు చెందిన ఎగ్జినోస్ 9810 చిప్‌సెట్‌ను ఉపయోగించింది. 4జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ30ఎస్

శాంసంగ్ గెలాక్సీ ఎ30ఎస్

ఈ ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు దాదాపు రూ. 8 వేల వరకు తగ్గింపును అందుకుంటారు. అలాగే రూ. 6 వేల వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Diwali Dhamaka Sales Offers On Samsung Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X