'డబ్ల్యు'కి కొద్ది పాటి మార్పులతో 'ఎగ్జిబిట్'...

Posted By: Staff

'డబ్ల్యు'కి కొద్ది పాటి మార్పులతో 'ఎగ్జిబిట్'...

 

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నాల్గవ అతి పెద్ద సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించిన టి-మొబైల్ బడ్జెట్‌కు అనుగుణంగా మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. శాంసంగ్ గెలాక్యీ డబ్ల్యుకి కొన్ని మార్పులు, చేర్పులు చేసి అమెరికన్స్‌కి 'శాంసంగ్ ఎగ్జిబిట్ II 4జీ' అనే సరిక్రొత్త మొబైల్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.  'శాంసంగ్ ఎగ్జిబిట్ II 4జీ'  స్మార్ట్ ఫోన్‌లో 1GHz స్నాప్ డ్రాగెన్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. అదే శాంసంగ్ గెలాక్యీ డబ్ల్యుతో పొల్చితే అందులో 1.4GHz స్కార్పియన్ కొర్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

కెమెరా విషయానికి వస్తే 3.2 మెగా ఫిక్సల్ వెనుక కెమెరాతో పాటు, మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరాతో వీడియా కాలింగ్ ఫీచర్‌ని కూడా అందుబాటులోకి తీసుకొని రావచ్చు.  'శాంసంగ్ ఎగ్జిబిట్ II 4జీ'  స్మార్ట్ ఫోన్‌లో ఉన్న కీ ఫీచర్స్‌ని ఒక్కసారి గమనించినట్లేతే...

'శాంసంగ్ ఎగ్జిబిట్ II 4జీ'  స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతలు:

* Quad-band GSM and dual-band 3G support

* 14.4 Mbps HSDPA; 5.76 Mbps HSUPA

* 1GHz Snapdragon CPU; Adreno 205 GPU; Qualcomm MSM 8255 chipset

* 512MB RAM; 1GB ROM; microSD card support (up to 32GB)

* 3.7” LCD display with WVGA (800 x 480 pixels) resolution; 252ppi pixel density

* Front-facing VGA camera for video calls

* Android 2.3.5 Gingerbread with TouchWiz 4.0 launcher

* Rich video format support out of the box

* Wi-Fi calling enabled

* Accelerometer, proximity and ambient light sensors

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 2.3.5 ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేశారు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 512MB RAM, 1GB ROM వస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. 3జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో  Lithium-ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. త్వరలో అమెరికాలో విడుదల కానున్న ఈ మొబైల్ ఆసియా మార్కెట్లోకి అతి త్వరలో రానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot