శామ్‌సంగ్ ఫ్రెండ్లీస్మార్ట్ మొబైల్!!!

Posted By: Super

శామ్‌సంగ్  ఫ్రెండ్లీస్మార్ట్  మొబైల్!!!

 

నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ రిసైకిలింగ్ ప్రక్రియ మరింత జటిలమవుతుంది. వినియోగదారులు ముఖ్యంగా కుర్రకారు తమ మొబైల్ ఫోన్‌లో ఏ చిన్న లోపం తలెత్తినా దాన్ని మూలన పడేసి కొత్తది కోనుగోలు చేస్తున్నారు. వ్యర్థంగా పడి ఉంటున్న ఈ డివైజ్‌లు హానికర యాసిడ్‌లతో పాటు నాన్ బయోగ్రేడబుల్ పదార్ధాలను ఉత్పత్తి చేస్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ‘శామ్‌సంగ్’ తాజాగా 80శాతం రిసైకిల్ పదార్థాలతో రూపొందించిన స్మార్ట్ మొబైల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయునుంది. ‘శామ్‌సంగ్ ఎక్సిలరేట్’ (Samsung Exhilarate)గా వస్తున్న ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్...

* 4.0 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్ స్ర్కీన్, * ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్స్, * మన్నికైన రేర్ కెమెరా అదేవిధంగా ఫ్రంట్ కెమెరా, * మెరుగైన పిక్సల్ రిసల్యూషన్‌తో వీడియో రికార్డింగ్, * ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * జీఎస్ఎమ్ సపోర్ట్, * యూఎమ్‌టీఎస్ సపోర్ట్, * మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచేందుకు గాను LTEఫీచర్, * బ్లూటూత్, * వై-ఫై, * జీపీఎస్, * యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * యూట్యూబ్, పికాసా ఆన్‌లైన్ సపోర్ట్ అప్లికేషన్స్, * హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్.

ఈ ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్ వినియోగదారుడిని యూజర్ ఫ్రెండ్లీ అనుభూతికి‌లోను చేస్తుంది. పొందుపరిచిన వేగవంతమైన ఇంటర్నెట్ అంశాలు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత చేరువ చేస్తాయి. పర్యావరణానికి మేలు చేయటంతో పాటు వేగవంతమైన మొబైలింగ్‌కు ఉపకరించే ‘శామ్‌సంగ్ ఎక్సిలరేట్’ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot