కొత్త కధతో మెగా హిరో!

Posted By: Prashanth

కొత్త కధతో మెగా హిరో!

 

మెగా ఫ్యామిలీ సామ్‌సంగ్ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది.. పర్యావరణానికి పూర్తి స్థాయి అనుకూలమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను బ్రాండ్ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ ప్రాసెసర్, ఉన్నత శ్రేణి మల్టీమీడియా ఫీచర్స్ వంటి ఉపయుక్తమైన అంశాలు ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకతలు. సామ్‌సంగ్ ఎక్సిలరేట్‌గా రూపుదిద్దుకున్నఈ డివైజ్ నిర్మాణంలో 80శాతం రిసైకిల్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. తక్కువ బరువు కలిగిన ఈ ఫోన్ రేర్ కేసింగ్‌ను రబ్బర్‌తో రూపకల్పన చేశారు. ఈ చర్యతో డివైజ్ మరింత ధృడత్వాన్ని సంతరించుకుంది.

టైపింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు అనువైన టైపింగ్ లేఅవుట్‌ను అమర్చారు. 4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ 480 x 800పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి నాణ్యమైన విజువుల్ అనుభూతులను యూజర్‌కు కలిగిస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం అనేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను సపోర్ట్ చెయ్యటంతో పాటు యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. డివైజ్‌లో ముందుగానే బుల్ట్ చేసిన ఆల్‌షేర్, ఆమోజన్ కిండిల్, నావిగేటర్ తదితర బిజినెస్, ప్రొఫెషనల్ అప్లికేషన్‌లు యూజర్ కమ్యూనికేషన్ బంధాలను మరింత పటిష్టం చేస్తాయి.

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లో 1.4జీబిని యూఎస్బీ స్టోరేజ్‌కి, 0.93జీబిని అప్లికేషన్‌లను స్టోర్ చేసుకునేందుకుగాను కేటాయించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ మెమెరీని మరింత పెంచుకోవచ్చు. పొందుపరిచిన 4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ ఆడ్వాన్స్ లెవల్ వెబ్‌బ్రౌజింగ్‌ను అందిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఎల్‌ఈడి ఫ్లాష్, జూమింగ్ సౌలభ్యతలను కలిగి ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. పొందుపరిచిన టచ్‌విజ్ మ్యూజిక్ ప్లేయర్, స్లాండర్డ్ వీడియో ప్లేయర్‌లు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. హ్యాండ్‌సెట్‌లో అమర్చిన 1,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో ఒకటిన్నర రోజు యూసేజ్‌ను అందిస్తుంది. ధర, ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot