సామ్‌సంగ్ ఫోకస్!

Posted By: Prashanth

సామ్‌సంగ్ ఫోకస్!

 

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని తనదైన శైలిలో శాసిస్తున్న సామ్‌సంగ్ ప్రజాదరణను మరింత పెంచుకునే పనిలో నిమగ్నమైంది. నిన్న మొన్నటి వరకు ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌ల తయారీకే పెద్ద‌పీట వేసిన ఈ దిగ్గజ బ్రాండ్ తన పంధాను మార్చుకుని విండోస్ ఆధారిత హ్యాండ్‌సెట్‌ల రూపకల్పన పై దృష్టిసారించింది. సామ్‌సంగ్ నుంచి ఇదివరుకే విడుదలైన విండోస్ ఆధారిత హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు ‘ఫోకస్’, ‘ఫోకస్ ఎస్’లు గ్యాడ్జెట్ ప్రియులను రంజింప చెయ్యటంలో సఫలీకృతమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ లైనప్ నుంచి ‘ఫోకస్ 2’ పేరుతో మరో హైఎండ్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ పరిచయం చెయ్యబోతోంది.

సామ్‌సంగ్ ఫోకస్ 2 ప్రధాన ఫీచర్లు:

- 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

- విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,

- 1.4గిగాహెడ్జ్ ప్రాసెసర్,

- 5 మెగాపిక్సల్ కెమెరా (ఫ్లాష్ సపోర్ట్),

- వీజీఏ ఫ్రంట్ కెమెరా,

- ఇంటర్న్‌ల్ స్టోరేజ్ 8జీబి,

- జీపీఆర్ఎస్,

- ఎడ్జ్,

- వై-ఫై,

- బ్లూటూత్,

- యూఎస్బీ కనెక్టువిటీ,

- జీపీఎస్ ఫెసిలిటీ,

- బ్రౌజర్(హెచ్‌టిఎమ్ఎల్),

- నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ,4జీ),

- ఆడియో ప్లేయర్,

- వీడియో ప్లేయర్,

- గేమ్స్,

- ఎఫ్ఎమ్ రేడియో,

ప్రధానంగా ఈ హ్యాండ్‌సెట్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. స్టాండర్ల్ వైట్ కలర్ వేరియంట్‌లో డిజైన్ కాబడిన ఈ ఫోన్ మే చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ధర ఇతర వివరాలు వెల్లడికావల్సి ఉంది. సామ్‌సంగ్ ప్రవేశపెట్టబోతున్న విండోస్ స్మార్ట్‌ఫోన్ మునపటి ఫోన్‍‌లు విజయాన్ని అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot