‘శ్యామ్‌సంగ్’, ‘ఎల్‌జీ’ల మధ్య ‘‘త్రీ’’డి ప్రకంపనలు..!!

Posted By: Staff

‘శ్యామ్‌సంగ్’, ‘ఎల్‌జీ’ల మధ్య ‘‘త్రీ’’డి ప్రకంపనలు..!!

ప్రపంచ మొబైల్ రంగంలో చోటు చేసుకుంటున్నపరిణామాలు రోజుకో అద్భుతాన్ని తలపిస్తున్నాయి. నిన్న.. మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ల వైపు తయారీదారులు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రపంచాన్ని 'త్రీ"డి ప్రకంపనలు చుట్టుముడుతున్నాయి. వినూత్నసాంకేతికతతో ఎల్‌జీ బ్రాండ్ ఇప్పటికే 'ఎల్‌జీ ఆప్టిమస్ 3డీ" పేరుతో మొబైల్‌ను ప్రపంచ మార్కెట్లో (ఇండియన్ మార్కెట్లోకి ఇంకా రాలేదు) విడుదల చేసి నూతన ఒరవడికి నాంది పలికింది.

అయితే అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికి, మార్కెట్ వర్గాల్లో షికారు చేస్తున్న ఆ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏంటా ప్రకంపన అనుకంటున్నారా.. ప్రపంచ టాప్ మొబైల్ బ్రాండ్లలో ఒకటైన శ్యామ్‌సంగ్ 'గెలక్సీ 3డీ" పేరుతో ఓ త్రీడీ మొబైల్‌ను మార్కెట్లో విడుదల చుసేందుకు సన్నాహాలు చేస్తుందట. అయితే త్వరలో విడుదల కాబోతున్న ఈ 'త్రీ"డి మొబైల్ ఎల్‌జీ‌కి గట్టి పోటినివ్వనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మొదటిగా 'ఎల్‌జీ ఆప్టిమస్ త్రీడి"లోని అంశాలను పరిశీలిద్దాం.. 4.3 అంగుళాల 3డీ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ ఎల్‌సీడీ సామర్ధ్యం కలిగి 480 X 800 రిసల్యూషన్‌తో పనిచేస్తుంది. అయితే 'శ్యామ్‌సంగ్ గెలక్సీ 3డీ" 4.3 అంగుళాల డిస్ ప్లే కలిగి, సరికొత్త 'త్రీ"డి స్ర్ర్కీన్‌తో రూపుదిద్దకుంటుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ రెండు సెట్లు మార్కెట్లో మంచి హిట్ కొడతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా 'ఎల్ జీ ఆప్టిమస్" పనిచేస్తుంది. అయితే రూపుదిద్దకుంటున్న 'శ్యామ్‌సంగ్‌"లో మాత్రం సరికొత్త ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థతో పాటు అదనంగా టచ్‌విజ్ 4.0ను పొందుపరచవచ్చని సమాచారం. గెలక్సీ‌లోని ప్రొసెస్సింగ్ అంశాలను పరిశీలిస్తే శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రొసెస్సర్‌తో పాటు, 1GB ర్యామ్ కలిగి ఉంటుందని అంచనా. ఇక 'ఎల్‌జీ ఆప్టిమస్" విషయానికొస్తే 1GHz డ్యూయల్ కోర్ 'ఆర్మ్ కార్టెక్స్ - ఏ9 చిప్‌"తో పాటు 512 MB ర్యామ్‌ను పొందుపరిచారు. అంతేకాకుండా 'VR SGX540" అనే గ్రాఫిక్ మెసర్‌ను అనుసంధానించారు.

ఇక కెమెరా విషయానికి వస్తే 'ఎల్‌జీ ఆప్టిమస్" 5 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంది. అయితే విడుదలకాబోతున్న 'శ్యామ్‌సంగ్ గెలక్సీ" కెమెరా 8 మెగా పిక్సల్ ఉండొచ్చని అంచనా. అయితే ఎల్‌జీ 3డీ ఇప్పటికి ఇండియన్ మార్కెట్లో విడుదల కాలేదు. అయితే ఈ మొబైల్ మార్కెట్ ధర మాత్రం రూ.34,999 ఉంది. శ్యామ్‌సంగ్ ధర విషయానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot