శాంసంగ్ కొత్త ఫోన్ల మాయ,వీడియో చూస్తూ ఛాటింగ్, ఇండియాలోనే తొలిసారి..

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇతర సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి మార్కెట్లోకి ఒకేసారి నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇతర సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి మార్కెట్లోకి ఒకేసారి నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది.గెలాక్సీ సిరీస్‌లో తాజాగా ఏ6, ఏ6 ప్లస్, జే6, జే8 మోడళ్లను ఇండియా మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ ఫోన్లు రూ.13,990 నుంచి రూ.25,990 మధ్యలో లభించనున్నాయి. జే6, ఏ6, ఏ6ప్లస్‌లు నేటి నుంచి అందుబాటులోకి రానుండగా, జే8 మాత్రం జూన్ చివరి వారం నుంచి లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దుకాణాల్లో పేటీఎం మాల్‌ ద్వారా చెల్లిస్తే రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది.

చైనా ఫోన్లకు నోకియా షాక్, సేల్‌కు వచ్చిన 10 సెకన్లలోపే అవుటాఫ్‌ స్టాక్‌చైనా ఫోన్లకు నోకియా షాక్, సేల్‌కు వచ్చిన 10 సెకన్లలోపే అవుటాఫ్‌ స్టాక్‌

తొలిసారిగా చాట్‌ ఓవర్‌ వీడియో ఫీచర్‌

తొలిసారిగా చాట్‌ ఓవర్‌ వీడియో ఫీచర్‌

ఈ ఫోన్లలో భారత్‌లోనే తొలిసారిగా చాట్‌ ఓవర్‌ వీడియో ఫీచర్‌ను పొందుపరిచారు. ఒకవైపు వీడియో చూస్తూనే మరోవైపు చాటింగ్‌ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత ఈ ఫోన్లలో ఉన్నదని కంపెనీ డైరెక్టర్ సుమిత్ వాలియా ఈ సందర్భంగా తెలిపారు.

గత ఫోన్లతో పోలిస్తే..

గత ఫోన్లతో పోలిస్తే..

గత ఫోన్లతో పోలిస్తే వీటిల్లో ఇన్ఫినిటీ డిజైన్‌తో స్క్రీన్‌ సైజు 15 శాతం పెరిగింది. ఆన్‌డ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. 256 జీబీ వరకు సపోర్ట్‌ చేసే మైక్రో ఎస్‌డీ స్లాట్‌ ఉంది. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా ఉంది. కొత్త మోడళ్ల రాకతో ఈ ఏడాది కంపెనీ మార్కెట్‌ వాటా ప్రస్తుత 42 శాతం నుంచి 47 శాతానికి చేరుతుందని శాంసంగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ వాలియా తెలిపారు.

గెలాక్సీ ఏ6 : ధర రూ.21,990/22,990.

గెలాక్సీ ఏ6 : ధర రూ.21,990/22,990.

శాంసంగ్ గెలాక్సీ ఎ6 ఫీచర్లు
5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, శాంసంగ్ పే మినీ, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఏ6+ : ధర రూ.25,990.

గెలాక్సీ ఏ6+ : ధర రూ.25,990.

శాంసంగ్ గెలాక్సీ ఎ6 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, శాంసంగ్ పే మినీ, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ జే6 : ధర రూ.13,990/16,490.

గెలాక్సీ జే6 : ధర రూ.13,990/16,490.

శాంసంగ్ గెలాక్సీ జె6 ఫీచర్లు
5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ జే8 : ధర రూ.18,990.

గెలాక్సీ జే8 : ధర రూ.18,990.

శాంసంగ్ గెలాక్సీ జె8 ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A, J series devices with 'Infinity Display' now in India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X