జనవరి 2020 సెక్యూరిటీ అప్‌డేట్‌ను పొందిన గెలాక్సీ Aసీరీస్ స్మార్ట్‌ఫోన్‌లు

|

శామ్సంగ్ సంస్థ ఇటీవల తన స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్నింటి కోసం జనవరి 2020 సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు సంస్థ గెలాక్సీ ఎ 10, గెలాక్సీ ఎ 10s , గెలాక్సీ ఎ 20, గెలాక్సీ ఎ 30 ల కోసం ఈ సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌ కొన్ని సమస్యల యొక్క పరిష్కారాలు మరియు స్థిరత్వ మెరుగుదలలతో పాటు సరికొత్త సెక్యూరిటీ పాచ్‌ను తెస్తుంది.

 

 తాజా అప్‌డేట్‌

గెలాక్సీ ఎ 10 యొక్క తాజా అప్‌డేట్‌ SM-A105G వేరియంట్ కోసం సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను ASK3 నుండి ASL4 కు పెంచుతున్నది. గెలాక్సీ A10s యొక్క SM-A107F వేరియంట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ ASL3 ను పొందుతుంది. మరోవైపు గెలాక్సీ ఎ 20 యొక్క SM-A205F వేరియంట్ కోసం బిల్డ్ నంబర్‌ను ASL2 కు తీసుకువస్తుంది. చివరగా గెలాక్సీ ఎ 30 అప్‌డేట్‌ SM-A305F వేరియంట్ కోసం ASL1 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో విడుదల అవుతోందని తెలిసింది.

 

 

ఇండియన్స్ రోజులో స్మార్ట్‌ఫోన్‌ను ఎంత సేపు వాడుతున్నారో తెలుసా?ఇండియన్స్ రోజులో స్మార్ట్‌ఫోన్‌ను ఎంత సేపు వాడుతున్నారో తెలుసా?

అప్‌డేట్‌ కొత్త ఫీచర్లు
 

అప్‌డేట్‌ కొత్త ఫీచర్లు

ఈ అప్‌డేట్‌ కొత్త ఫీచర్లను తీసుకురాదు కానీ బగ్ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే జనవరి 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో సెక్యూరిటీ మెరుగుదలతో పాటుగా స్మార్ట్‌ఫోన్‌ యొక్క పనితీరు మెరుగుదలను కూడా పొందవచ్చు. వన్ UI 2.0. తో ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లో భాగంగా కొత్త ఫీచర్లు వస్తాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడు ఈ కొత్త అప్‌డేట్‌ను పొందుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

 

 

ఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివోఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివో

 గెలాక్సీ ఎ-సిరీస్

గెలాక్సీ ఎ-సిరీస్

నాలుగు గెలాక్సీ ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో దశలవారిగా కొత్త అప్‌డేట్‌ OTA గా విడుదల అవుతోంది. మీరు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో దేనినైనా కలిగి ఉంటే పుష్ నోటిఫికేషన్ ద్వారా అప్‌డేట్‌ను స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేయడానికి మీకు నోటిఫికేషన్ వస్తుంది.

 

 

ATMను ఉపయోగించే విధానాన్ని మారుస్తున్న SBIATMను ఉపయోగించే విధానాన్ని మారుస్తున్న SBI

 

ప్రత్యామ్నాయం

దీనికి ప్రత్యామ్నాయంగా కావాలి అంటే కింది పద్ధతులు పాటించండి. సిస్టమ్ -> సిస్టమ్ -> సిస్టమ్ అప్‌డేట్‌ -> డౌన్‌లోడ్ -> ఇన్‌స్టాల్ చేయడం ద్వారా అప్‌డేట్‌ లభ్యతను తనిఖీ చేయవచ్చు. ఒకవేళ వినియోగదారులు తమ గెలాక్సీ పరికరంలో దీన్ని మాన్యువల్‌గా ఫ్లాష్ చేయాలనుకుంటే కనుక శామ్సంగ్ FUS (ఫర్మ్‌వేర్ అప్‌డేట్ సర్వర్) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని డౌన్‌లోడ్ చేయడానికి ఇప్పుడు ఫర్మ్‌వేర్ కూడా అందుబాటులో ఉంది.

 

 

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లుప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

శామ్‌సంగ్ One UI 2.0 ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ రోడ్‌మ్యాప్

శామ్‌సంగ్ One UI 2.0 ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ రోడ్‌మ్యాప్

గత నెలలో శామ్సంగ్ తన సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. 2020 మే నెలలో శామ్‌సంగ్ యొక్క ఆరు స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 10 వన్ యుఐ 2.0 అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు జాబితా వెల్లడించింది. వీటిలో గెలాక్సీ ఎ 8 స్టార్, ఎ 10, ఎ 10s, ఎ 20, ఎ 30, మరియు ఎం 10 లు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy A-Series Smartphones Received January 2020 Security Update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X