కేవ‌లం రూ.10వేల‌లో బ‌డ్జెట్ మొబైల్‌ను విడుద‌ల చేసిన Samsung!

|

Samsung కంపెనీ భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రింప‌జేస్తోంది. తాజాగా బ‌డ్జెట్ సెగ్మెంట్‌లో మ‌రో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుద‌ల చేసింది. Samsung Galaxy A04 పేరుతో వ‌స్తున్న ఈ మొబైల్ ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. Samsung Galaxy A04 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6.5-అంగుళాల డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ మరియు మరిన్ని అద్భుత ఫీచ‌ర్ల‌తో ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించి పూర్తి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు, ఫీచ‌ర్లు, ధ‌ర‌ల వివ‌రాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A04

Samsung Galaxy A04 ధ‌ర‌లు:
Samsung Galaxy A04 ధరను శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు, అయితే కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,499గా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. Samsung Galaxy A04 బ్లాక్‌, వైట్‌, కాప‌ర్ మరియు గ్రీన్ మొత్తం నాలుగు రంగు ఎంపికలలో ప్రారంభించబడింది.

Samsung Galaxy A04 స్పెసిఫికేష‌న్లు:
Samsung Galaxy A04 HD+ రిజల్యూషన్ తో 6.5-అంగుళాల LCD ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో విడుద‌లైంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ Unisoc SC9863A (28nm) చిప్ సెట్ ద్వారా రన్ అవుతుంది. అంతేకాకుండా, ఇది 8GB RAM మరియు 128GB వరకు ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో జత చేయబడింది. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజీని ఎక్స్‌ప్యాండ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తుంది.

Samsung Galaxy A04

Samsung Galaxy A04 మొబైల్ కు బ్యాక్ సైడ్ డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ ఇస్తున్నారు. 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో ప్రైమరీ షూటర్ మరియు మ‌రొక‌టి 2-మెగాపిక్సెల్ క్వాలిటీలో డెప్త్ సెన్సార్ కెమెరా ఇస్తున్నారు. ఇక సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా రన్ అవుతుంది మరియు వన్ UI కోర్ 4.1తో వస్తుంది. Samsung Galaxy A04లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 5.0 మరియు మరిన్ని ఉన్నాయి. Samsung Galaxy A04లోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, లైట్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

Samsung Galaxy A04

అదేవిధంగా, గ‌త నెల‌లో Samsung నుంచి విడుద‌లైన మ‌రో బ‌డ్జెట్ మొబైల్ Samsung Galaxy M13 5G మొబైల్ గురించి కూడా తెలుసుకుందాం:
Samsung Galaxy M13 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. Samsung Galaxy M13 5G మోడ‌ల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. 4GB+64GB| 6GB+128GB వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. ఈ మొబైల్ డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek MT6833 Dimensity 700 (7 nm) ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy M13 5G మొబైల్ కు బ్యాక్ సైడ్ డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ ఇస్తున్నారు. 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో ప్రైమరీ షూటర్ మరియు మ‌రొక‌టి 2-మెగాపిక్సెల్ క్వాలిటీలో డెప్త్ సెన్సార్ కెమెరా ఇస్తున్నారు. ఇక సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా రన్ అవుతుంది మరియు వన్ UI కోర్ 4 తో వస్తుంది. Samsung Galaxy A04లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 802.11, బ్లూటూత్ 5.0 మరియు మరిన్ని ఉన్నాయి. ప్ర‌స్తుతం అమెజాన్‌లో Samsung Galaxy A04 మొబైల్ 6GB+128GB వేరియంట్ రూ.15,999 కు కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A04 Budget Smartphone Launched In India: Price, Specifications And More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X