Home
Mobile

ధర రూ.7,874 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌..!

శాంసంగ్‌ గత సంవత్సరం ఎంట్రీ లెవల్‌ ధర లో అనేక హ్యాండ్‌సెట్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో A, F సిరీస్‌ హ్యాండ్‌సె ట్‌లు ఉన్నాయి. సుమారు రూ.10,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా.. అనేక మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. గత వారం కూడా శాంసంగ్‌ నుంచి గెలాక్సీ F06 5G ఫోన్‌ను రూ.10 వేల ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A05 Smartphone) రూ.8000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్‌ రూ.9,999 ఉండగా.. ప్రస్తుతం రూ.7,779 కే కొనుగోలు చేయవచ్చు.

Samsung galaxy A05 Smartphone

అదే 6GB ర్యామ్ వేరియంట్‌ విడుదల సమయంలో రూ.12,499 గా ఉంది. రూ.7,874 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో లభిస్తోంది. బ్లాక్‌, లైట్ గ్రీన్‌, సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ సౌకర్యంగా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ HD+ డిస్‌ప్లేతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల (720*1600 పిక్సల్స్‌) HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 260PPI డెన్సిటీని కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత One UI core 5.1 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీ పెంచుకోనే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌, వైఫై, GPS, 3.5mm ఆడియో జాక్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ, యాక్సెలిరోమీటర్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అమర్చి ఉంది.

గత వారం శాంసంగ్‌ నుంచి గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 4GBర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. ఈ నెల 20 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ బహమా బ్లూ, లిట్‌ వైలెట్‌ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy A05 Smartphone available at rs7874 price on amazon check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X