ధర రూ.10499 కే 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో శాంసంగ్ 5G ఫోన్.
టెక్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల కాలంలో ఎంట్రీ లెవల్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. గత వారం గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో రూ.10,000 కంటే తక్కువ ధరలో అనేక మోడళ్లను లాంచ్ చేసింది. గత సంవత్సరం గెలాక్సీ A06 4G వేరియంట్‌ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా గెలాక్సీ A06 5G వేరియంట్‌ను భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
శాంసంగ్ కొత్త ఫోన్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చినా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. HD+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 OS, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు సహా మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది.

ధర రూ.129 చెల్లించిన గెలాక్సీ A06 5G (Samsung Galaxy A06 5G Smartphone) కస్టమర్‌లకు సంవత్సరం వరకు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ అందిస్తున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ కేర్ + యూనిట్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల (720*1600 పిక్సల్స్) HD+ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 12GB వరకు ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా శాంసంగ్ A సిరీస్ 5G కొత్త ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. LED ఫ్లాష్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు.
5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G (SA/NSA), బ్లూటూత్ 5.3, వైఫై 802.11, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 12 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది. కాల్ క్లారిటీ కోసం వాయిస్ ఫోకస్ సహా డేటా భద్రత కోసం Knox Vault సెక్యూరిటీ ఫీచర్‌ను కలిగి ఉంది.
గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. శాంసంగ్ ఆఫ్‌లైన్, ఆన్‌లోన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. లైట్ గ్రీన్, గ్రే, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








