Home
Mobile

రూ.9,183 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 4 సంవత్సరాల అప్‌డేట్స్ ఇచ్చే శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌..!

Samsung galaxy A06 5G Smartphone : శాంసంగ్‌ గెలాక్సీ A06 4G స్మార్ట్‌ ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ ఫోన్ 5G వేరియంట్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

విడుదల సమయంలో ధరలు ఇలా :
శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.10499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,499 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung galaxy A06 5G Smartphone now available at Rs9183 price on flipkart features specifications

ప్రస్తుతం డిస్కౌంట్‌తో :
ఫ్లిప్‌కార్ట్‌ లో 4GB/64GB ధర రూ.9183 గా ఉంది. 4GB/128GB వేరియంట్ ధర రూ.9961 కే కొనుగోలు చేయవచ్చు. 6GB/128GB వేరియంట్ ధర రూ.10064 గా ఉంది. ఈ ఫోన్‌ గ్రీన్, గ్రే, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ A06 5G స్మార్ట్‌ ఫోన్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని శాంసంగ్‌ తెలిపింది.

Samsung galaxy A06 5G Smartphone now available at Rs9183 price on flipkart features specifications

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, LED ఫ్లాష్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, WiFi 802.11, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది. వాయిస్‌ ఫోకస్‌, Knox Vault సెక్యూరిటీ ఫీచర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy A06 5G Smartphone now available at Rs9183 price on flipkart features,specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X