ధర రూ.9999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి తాజాగా స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A06 Smartphone Launched) విడుదల అయింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే ఈ హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.7 అంగుళాల డిస్‌ప్లే సహా 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటోంది.
శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ ధర :
శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB హ్యాండ్‌సెట్ ధర రూ.9999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ లు :
శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 1600*720 పిక్సల్ రిజల్యూషన్, 60Hz రీప్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ కొత్త హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ హీలియో G85 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. Mali G52 MP2 GPU ప్రాసెసర్‌తో జతచేయబడుతుంది. ఈ ఫోన్ రెండు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని శాంసంగ్ తెలిపింది.
కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, అదే విధంగా f/2.4 అపేచర్‌తో 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు LED లైట్‌ను కూడా అమర్చారు. దీంతోపాటు f/2.0 అపేచర్‌తో 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉందు.
కనెక్టివిటీ పరంగా ఈ శాంసంగ్ కొత్త హ్యాండ్‌సెట్ 4G LTE, Wi-Fi 802, బ్లూటూత్ V5.3 మరియు GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు శాంసంగ్ Knox ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








