Home
Mobile

రూ.10000 ధరకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 డిస్‌ప్లే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌..!

శాంసంగ్‌ నుంచి గ్లోబల్‌ మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. శాంసంగ్‌ తన A సిరీస్‌ విస్తరణలో భాగంగా గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా సహా 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. రూ.10 వేల ధర సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు :
శాంసంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A06 Smartphone) 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లే ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగాను ఆకట్టుకుంటుంది.

Samsung Galaxy A06 Smartphone

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI OS ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో G85 SoC చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. 4GB LPDDR4x ర్యామ్ మరియు 64GB eMMC 5.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ మరియు 2 OS అప్‌డేట్‌లను పొందుతుంది.

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ తో అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

Samsung Galaxy A06 Smartphone

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ‌డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్‌ సెన్సార్‌ను అమర్చారు. LED ఫ్లాష్‌ లైట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు f/2.0 అపేచర్‌తో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరియు 3.5mm ఆడియో జాక్‌తో అందుబాటులో ఉంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ శాంసంగ్‌ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్‌ వియత్నాంలోనే అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర 3,190,000 వియత్నామీస్‌ డాంగ్‌ (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.10,675) గా ఉంది. భారత్‌ సహా ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A06 Smartphone Launched globally specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X