Home
Mobile

శాంసంగ్‌ నుంచి త్వరలో కొత్త A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌... స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు. లాంచ్ వివరాలు..!

శాంసంగ్‌ నుంచి A సిరీస్ స్మార్ట్‌ ఫోన్ త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ శాంసంగ్‌ గెలాక్సీ A06 హ్యాండ్‌ సెట్‌ ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌ లో కనిపించింది. దీని ఆధారంగా త్వరలోనే భారత్‌ లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ (Samsung Galaxy A06 Smartphone) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

శాంసంగ్‌ గెలాక్సీ A06 స్మార్ట్‌ ఫోన్‌ గీక్‌బెంచ్ డేటాబేస్‌ మరియు వైఫై అలియన్స్‌ సర్టిఫికేషన్‌లోనూ కనిపించింది. BIS లో SM-A065F/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ Mali G52 GPU మరియు 6GB ర్యామ్‌తో జతచేయబడుతుంది తెలుస్తోంది.

Samsung Galaxy A06 Smartphone

గత సంవత్సరం భారత్‌లో లాంచ్‌ అయిన శాంసంగ్‌ గెలాక్సీ A05 హ్యాండ్‌సెట్‌ కు తర్వాత తరం స్మార్ట్‌ఫోన్‌గా A06 రానుందని తెలుస్తోంది. ఈ A05 స్మార్ట్‌ ఫోన్‌ 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌ తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ను కలిగి ఉంది.

గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ G85 SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. 6GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియా కాల్ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,699 గా ఉంది. అయితే గెలాక్సీ A06 హ్యాండ్‌సెట్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 పై ఇటీవల ప్రకటన వచ్చింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 జులై 10న పారిస్‌ లో జరగనుంది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌ (Samsung.com), శాంసంగ్‌ న్యూస్‌రూం, శాంసంగ్ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌ చూడవచ్చు. జులై 10వ తేదీ 6.30PM గంటలకు ఈ లైవ్‌ ప్రారంభం కానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 లో గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 విడుదలయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ AI తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే ఈవెంట్‌లో గెలాక్సీ బడ్స్‌ 3 సిరీస్‌ పైన ప్రకటన చేసే అవకాశం ఉంది. మరియు గెలాక్సీ రింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. శాంసంగ్‌ తొలిసారిగా అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7 కూడా విడుదలపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A06 Smartphone spotted on BIS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X