Home
Mobile

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్.. ధర వివరాలు లీక్‌..!

Samsung Galaxy A07 5G Smartphone : శాంసంగ్ గెలాక్సీ A07 4G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో ఇప్పటికే విడుదల అయింది. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్ 5G వేరియంట్‌ త్వరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ లో విడుదలపై శాంసంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి.

కీలక వివరాలు లీక్‌ :
గ్లోబల్‌ మార్కెట్‌ లో గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీని ఆధారంగా భారత్‌ వేరియంట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కొంత వరకు అంచనా వేయవచ్చు. ఈ ఫోన్ ఇండియా వేరియంట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

samsung galaxy A07 5G

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ One UI 8.0 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని తెలుస్తోంది. సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌ ఉంటాయని సమాచారం. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

6000mAh బ్యాటరీ, IP54 రేటింగ్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 25W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8.2mm థిక్‌నెస్‌ తో 199 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ లైట్‌ వైలెట్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుందని తెలుస్తోంది.

ధర అంచనా వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ లీక్‌ చేశారు. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15999 గా ఉంటుందని అంచనా వేశారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 ఉంటుందని చెబుతున్నారు.

* శాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఈ ఫోన్‌ చైనా సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌ TENAA లో లిస్టింగ్‌ అయింది. అయితే శాంసంగ్‌ మాత్రం ఈ ఫోన్ విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. వచ్చే నెలలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ లో గెలాక్సీ S26 సిరీస్‌ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy A07 5G smartphone price tipped in india expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X