Home
Mobile

బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ 5G ఫోన్‌ విడుదల..!

Samsung Galaxy A07 5G smartphone : శాంసంగ్‌ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో లాంచ్ అయింది. శాంసంగ్ వెబ్‌సైట్‌ లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ చిప్‌సెట్‌, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ బడ్జెట్‌ రేంజ్‌ లో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 800 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 16 మిలియన్‌ కలర్ ను సపోర్టు చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

Samsung galaxy A07 5G smartphone

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీ ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 6 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా గెలాక్సీ A07 5G ఫోన్‌ పిల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో f/1.8 అపేచర్‌, 10x డిజిటల్‌ జూమ్, ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP డెప్త్ సెన్సర్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 1080p రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

Samsung galaxy A07 5G smartphone

గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంకా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, జియో మాగ్నటిక్ సెన్సర్‌, లైట్‌ సెన్సర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌ లు ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ లో భాగంగా HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Samsung galaxy A07 5G smartphone

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, లైట్‌ వైలెట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy A07 5G smartphone with 6000mAh battery, mediatek dimensity 6300 chip launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X