బడ్జెట్ ధరలో 6 ఏళ్ల అప్‌డేట్స్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్!
శాంసంగ్ ఇటీవల గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అల్ట్రా మోడల్ ఫోన్ ప్రైవసీ డిస్‌ప్లే తో అందుబాటులోకి వచ్చింది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
దీంతోపాటు భారత్ మార్కెట్ లో త్వరలో బడ్జెట్, మిడ్ రేంజ్ లో అనేక మోడల్స్ అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే గత నెలలో బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A07 5G Smartphone) విడుదల అయింది. అయితే బడ్జె్ట్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తోంది. దీంతోపాటు 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే ని కలిగి ఉంది.

రూ.15999 ప్రారంభ ధరతో :
శాంసంగ్ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందుతుంది.
డిస్‌ప్లే, కలర్ వేరియంట్స్ :
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్, లైట్ వైలెట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. ఈ శాంసంగ్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
6000mAh బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ శాంసంగ్ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆటోఫోకస్, 10x డిజిటల్ జూమ్ తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP డెప్త్ సెన్సర్ ఉంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్, జియో మాగ్నటిక్ సెన్సర్, యాక్సిలిరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








