శాంసంగ్ నుంచి బడ్జెట్ రేంజ్ ఫోన్‌లు గెలాక్సీ A07, M07, F07.. ఎప్పుడు విడుదల కానున్నాయి..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఈ సంవత్సరం తొలి మూడు నాలుగు నెలల్లో ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. రూ.10 వేలు కంటే తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ధరలోనూ ఆకట్టుకొనే డిజైన్, మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో లాంచ్ అయ్యాయి. మరియు ముఖ్యంగా 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతున్నాయి.
BIS లో లిస్టింగ్ :
అయితే తాజా వివరాల ఆధారంగా శాంసంగ్ మరిన్ని బడ్జెట్ మోడల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ కొత్త మోడల్స్ గెలాక్సీ A07 (Samsung Galaxy A07), గెలాక్సీ M07 (Galaxy M07), గెలాక్సీ F07 (Galaxy F07) పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్స్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో (BIS) కనిపించాయి.

ఈ వివరాలను Xpertpick వెల్లడించింది. దీని ఆధారంగా భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. BIS లో SM - A075F/DS, SM - M075F/DS, SM - F075F/DS మోడల్ పేర్లతో కనిపించాయి. ఈ ఫోన్‌లు BIS సర్టిఫికేషన్ కూడా పొందాయని Xpertpick తెలిపింది.
ఈ ట్రాకింగ్ ప్లాట్‌ఫాంలలోనూ :
ఈ శాంసంగ్ బడ్జెట్ రేంజ్ ఫోన్‌లు BIS లిస్టింగ్ కంటే ముందే అంతర్జాతీయ ఎగుమతి/ దిగుమతుల ట్రాకింగ్ ప్లాట్‌ఫాం Nemko, NBD లో లిస్టింగ్ అయినట్లు 91మొబైల్స్ తెలిపింది. అయితే ఈ మోడల్ నంబర్ల ఆధారంగా ఇవన్నీ 4G మోడల్స్‌గా తెలుస్తున్నాయి. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గెలాక్సీ A07, గెలాక్సీ M07, గెలాక్సీ F07 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన డిస్‌ప్లే, చిప్‌సెట్, బ్యాటరీ, కెమెరాలు ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాలేదు. మీడియాటెక్ లేదా Exynos చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు LCD డిస్‌ప్లేలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులై నుంచి ఈ ఫోన్ల విడుదల ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 S0C చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.7999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.8499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.9799 గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.8499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499 గా ఉంది.


Click it and Unblock the Notifications