Samsung Galaxy కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్స్ & ధరలు ఇవే!!

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్సంగ్ యూరోపియన్ మార్కెట్ కోసం బడ్జెట్ ధరలో గెలాక్సీ A12 మరియు గెలాక్సీ A02 ల అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య 5,000mAh బ్యాటరీ మరియు 6.5-అంగుళాల డిస్ప్లే వంటి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం గెలాక్సీ A12 ను మూడు వేర్వేరు స్టోరేజ్ మరియు ర్యామ్ వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే గెలాక్సీ A02 ను మాత్రం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ ప్రస్తుతానికి తెలియదు. సంస్థ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల గురించి విడుదల చేసిన ధర మరియు ప్రత్యేకతల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శామ్సంగ్ గెలాక్సీ A12 మీడియాటెక్ హెలియో P35 Soc స్పెసిఫికేషన్స్ వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A12 మీడియాటెక్ హెలియో P35 Soc స్పెసిఫికేషన్స్ వివరాలు

శామ్సంగ్ సంస్థ కొత్త గెలాక్సీ A12 ను 6.5-అంగుళాల HD + TFT డిస్ప్లేతో ప్రకటించింది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో P35 Socతో రన్ అవుతూ 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డు సహాయంతో మెమొరిని 1TB వరకు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కెమెరా విభాగంలో గెలాక్సీ A12 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్ 5MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెకండరీ సెన్సార్‌ మరియు రెండు 2MP స్థూల మరియు డీప్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉంటాయి. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A12 ధరల వివరాలు
 

శామ్సంగ్ గెలాక్సీ A12 ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A12 స్మార్ట్‌ఫోన్ ను మూడు విభిన్న వేరియంట్‌లలో విడుదల చేయనున్నది. ఇందులో 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర EUR 179 (సుమారు రూ.15,800), 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర EUR199 (సుమారు రూ .17,500). చివరిది మూడవ వేరియంట్ యొక్క ధరను శామ్‌సంగ్ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఫోన్ ప్రజలకు జనవరి 2021 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ A02s స్నాప్‌డ్రాగన్ 450 SoC స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A02s స్నాప్‌డ్రాగన్ 450 SoC స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A02s ఫోన్ కూడా 6.5 అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేతో ప్రకటించబడింది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 SoCతో రన్ అవుతూ 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డు సహాయంతో స్టోరేజ్ ను 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13MP లెన్స్ ప్రైమరీ సెన్సార్ మరియు రెండు 2MP సెన్సార్‌లతో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 15W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి వస్తుంది. శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ A02sను ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే ప్రకటించారు. దీని సింగిల్ వేరియంట్ 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ యొక్క ధర EUR 150 (సుమారు రూ.13,200). ఇది ఫిబ్రవరి 2021 నుండి విక్రయించడానికి అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A12 & A02s New Budget Smartphones Announced: Price, Specs, Release Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X