Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ A15 స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ వేరియంట్‌ విడుదల.. రూ.1500 తగ్గింపు..!!

శాంసంగ్‌ సంస్థ తన గెలాక్సీ A15 5G స్మార్ట్‌ ఫోన్‌ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. Samsung Galaxy A15 5G స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పటికే 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. తాజాగా శాంసంగ్‌ సంస్థ 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది.

శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర : శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy A15 5G New Variant) కొత్తగా లాంచ్‌ చేసిన 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17,999 గా ఉంది. అయితే బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.1500 తగ్గింపు ధరను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.16,499గా ఉంది.

Samsung Galaxy A15 5G Smartphone 6GB RAM Variant launched

ఇప్పటికే అందుబాటులో ఉన్న 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19,499 అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,499 గా ఉంది. ఈ రెండు వేరియంట్లు గత సంవత్సరం డిసెంబర్‌లో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం బ్లూ, బ్లూ బ్లాక్‌, లైట్ బ్లూ రంగుల్లో శాంసంగ్‌ వెబ్‌సైట్‌ సహా ఇతర ఆన్‌లైన్‌ స్టోర్‌లలో లభిస్తున్నాయి.

5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ, నాలుగేళ్లపాటు OS అప్‌డేట్లు : ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత One UI 5 పైన పనిచేస్తుంది. 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ, నాలుగు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ సంస్థ తెలిపింది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీని కలిగి ఉంది.

Samsung Galaxy A15 5G Smartphone 6GB RAM Variant launched

ట్రిపుల్‌ కెమెరా, సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే : శాంసంగ్‌ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2408 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 5MP, 2MP కెమరాలను కలిగి ఉంటుంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

21 గంటలపాటు వీడియో ప్లే బ్లాక్‌ టైం : ఈ శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 21 గంటలపాటు వీడియో ప్లే బ్లాక్‌ టైం వస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు భద్రత కోసం ఈ ఫోన్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A15 5G కనెక్టివిటీ ఫీచర్లు : కనెక్టివిటీ పరంగా ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ 5G, వైఫై, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5 హెడ్‌ఫోన్‌ జాక్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సిలిరోమీటర్‌, గైరో సెన్సార్, జియోమాగ్నటిక్ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, వర్చువర్ ప్రాక్సిమిటీ సెన్సార్లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A15 5G Smartphone 6GB RAM Variant launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X