Home
Mobile

ధర రూ.16,390 కే 8GB ర్యామ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్..!

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌ (Flipkart Samsung Festive Days Sale) జరుగుతోంది. ఈ సేల్‌ ఈనెల 7 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా ప్రస్తుతం శాంసంగ్‌ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A15 5G Smartphone) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం డిసెంబర్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో వచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 6GB ర్యామ్ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరా సహా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మూడు స్టోరేజీ, కలర్‌ వేరియంట్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బ్లూ, బ్లూ బ్లాక్‌, లైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

Samsung Galaxy A15 5G Smartphone

ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ వేరియంట్ ధర రూ.19,499 గా ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.16,390 ధరకే కొనుగోలు చేయవచ్చు. సుమారు రూ.3000 పైగా తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2408 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ కనిష్టంగా 6GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 పైన పనిచేస్తుంది. 4 OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ శాంసంగ్‌ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ శాంసంగ్‌ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 21 గంటలపాటు వీడియో ప్లే బ్యాక్‌ టైంను పొందవచ్చని శాంసంగ్ తెలిపింది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G, Wi-Fi 802, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సిలిరోమీటర్‌ సెన్సార్‌, జియోమాగ్నటిక్ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, వర్చువర్ ప్రాక్సిమిటీ సెన్సార్‌ వంటి సెన్సార్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A15 5G Smartphone gets massive price drop on Flipkart specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X