Home
Mobile

ధర రూ.14,399 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB శాంసంగ్ 5G ఫోన్‌..!

శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Samsung Galaxy A15 5G smartphone) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్‌ 2023 లో ఈ ఫోన్‌ విడుదల అయింది. ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీను కలిగి ఉంది. మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని శాంసంగ్‌ విడుదల సమయంలో హామీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరారు.

మూడు స్టోరేజీ వేరియంట్‌ :
భారత్‌ మార్కెట్‌ లో శాంసంగ్‌ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌ లో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) 6GB ర్యామ్ వేరియంట్‌ను ధర రూ.14,399 కు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A15 5G smartphone

5 శాతం అదనపు డిస్కౌంట్‌ :
అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21295 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. లైట్‌ బ్లూ, బ్లూ, బ్లూ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ A15 హ్యాండ్‌సెట్‌ (Samsung Galaxy A15 5G) 6.5 అంగుళాల FHD+ (1080*2408 పిక్సల్స్‌) సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OneUI 5 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుందని శాంసంగ్ హామీ ఇచ్చింది.

50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలతో అందుబాటులో ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 13MP కెమెరాను అమర్చి ఉంది.

5000mAh బ్యాటరీ :
శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, WiFi 802, GPS, USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులో ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ సెన్సార్‌, జియోమాగ్నటిక్ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, వంటి సెన్సార్‌తో అందుబాటులో ఉంది. భద్రత కోసం ఈ ఫోన్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A15 5G smartphone gets price drop on flipkart in india in january 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X