శాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల తన రెండు కొత్త హ్యాండ్‌సెట్‌లు గెలాక్సీ A25 5G, గెలాక్సీ A15 స్మార్ట్‌ఫోన్‌లను (Samsung Galaxy A25 5G and A15 5G) డిసెంబర్ 11న వియత్నాంలో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు భారత్‌లోనూ విడుదల కానున్నాయి. భారత్‌లోనూ ఇదే స్పెసిఫికేషన్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A25 5G, A15 5G స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0 సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే సహా 25W వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారత్ మార్కెట్‌లో డిసెంబర్ 26 మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల కానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్ A14 5G హ్యాండ్‌సెట్‌కు తర్వాత వెర్షన్‌గా విడుదల అయింది. ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా సహా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ప్రధాన కెమెరా వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ అనేక ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్.. 120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు OIS- ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ ఫీచర్ సపోర్టుతో 50MP కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌తో వస్తుందని సంస్థ చెబుతోంది. మరియు 5nm చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A25 5G, A15 5G రెండు స్మార్ట్‌ఫోన్లు Knox సెక్యూరిటీ ప్లాట్‌ఫాంతో రానున్నాయి. ఆటో బ్లాకర్, సెక్యూర్ ఫోర్టర్, ప్రైవసీ డ్యా్ష్‌బోర్డ్, శాంసంగ్ పాస్‌కీ వంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉండనుంది. డేటా భద్రత కోసం Knox Vault చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరలపై ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. అయితే గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.22,500గా ఉంటుందని తెలుస్తోంది. అదే A15 స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.21,500గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ మరియు పసుపు రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

గెలాక్సీ A25, A15 స్పెసిఫికేషన్లు: వియత్నాంలో విడుదలైన ఫోన్ల వివరాలు ఆధారంగా.. గెలాక్సీ A25 స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటాయి. A15 5G హ్యాండ్‌సెట్ 90Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.
గెలాక్సీ A25 5G హ్యాండ్‌సెట్ Exynos 1280 SoC చిప్‌తో Mali- G68 MP4 GPUను కలిగి ఉంటుంది. అదే గెలాక్సీ A15 5G స్మా్ర్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ పైన పనిచేస్తాయి. మరియు ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0 పై పనిచేస్తాయని తెలుస్తోంది.
గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో వస్తుంది. మరియు 8MP అల్ట్రావైడ్ సెన్సార్ సహా 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. అదే A15 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 5MP ఆల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 13MP కెమెరాను కలిగి ఉంటుంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








