Home
Mobile

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ శాంసంగ్‌ 5G ఫోన్‌పై రూ.2000 తగ్గింపు.. 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్!

శాంసంగ్‌ ఇటీవల కాలంలో వరసగా కొత్త ఫోన్‌లను విడుదల చేస్తోంది. గెలాక్సీ S25 సిరీస్‌ వంటి ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌తోపాటు గెలాక్సీ A06 5G, గెలాక్సీ F06 5G సహా గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G ఫోన్‌లను విడుదల చేసింది. రేపు గెలాక్సీ A సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే ఏయే ఫోన్‌లు విడుదల కానున్నాయనే సమాచారాన్ని శాంసంగ్ వెల్లడించలేదు.

అయితే తాజాగా శాంసంగ్ గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Samsung Galaxy A16 5G Price Drop) డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ (Amazon) ఈ ఆఫర్‌ ను అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 50MP కెమెరాతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy A16 5G Smartphone

భారత్‌ మార్కెట్‌లో గెలాక్సీ A16 5G ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17,499 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో రూ.15,499 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18999 గా ఉండేది. ప్రస్తుతం రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు.

అదే విధంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే అన్ని వేరియంట్స్‌ పై రూ.2000 డిస్కౌంట్‌ తో లభిస్తోంది. ఈ ఫోన్‌ బ్లూ, బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల పుల్‌ HD+ (1080*2340 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.

ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందనుందని శాంసంగ్‌ వెల్లడించింది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా. 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, వైఫై 5, NFC, GPS వంటి ఫీచర్‌లున్నాయి. భద్రత కోసం ఈ ఫోన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. Knox Vault ఫీచర్‌, ట్యాప్‌ అండ్‌ పే పేమెంట్స్‌ ఫీచర్‌, వాయిస్‌ ఫోకస్‌ వంటి ఫీచర్‌లున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A16 5G Smartphone gets Rs2000 pricedrop on amazon check full specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X