రూ.2500 డిస్కౌంట్.. 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఫోన్..!
Samsung Galaxy A16 5G : దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల కాలంలో అన్ని సెగ్మెంట్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఫలితంగా ఎంట్రీ, బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం మోడల్స్‌ను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనేక బడ్జెట్ సెగ్మెంట్ మోడల్స్‌ను తీసుకొచ్చింది. అయితే గత సంవత్సరం చివల్లో లాంచ్ అయిన మోడల్‌ను ప్రస్తుతం రూ.15 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.
బ్యాంకు కార్డులపై క్యాష్‌బ్యాక్ :
భారత్ మార్కెట్‌లో గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే విడుదల అయింది. అయితే గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ A16 5G మోడల్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

రూ.2500 డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభం ధర రూ.14999 గా ఉంది. అంటే రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అదే విధంగా 8GB/128GB వేరియంట్ ధర రూ.17499 గా ఉంది. అయితే 8GB/256GB స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో లేదు. Sold Out ట్యాగ్ కనిపిస్తోంది. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ గెలాక్సీ A16 5G హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్, ఫ్లిప్‌కార్ట్ SBI కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
శాంసంగ్ గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. వాయిస్ క్లాలిటీ కోసం వాయిస్ ఫోకస్ ఫీచర్‌ను అమర్చి ఉంది. Knox Vault ఫీచర్, ట్యాప్ అండ్ పే పేమెంట్స్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
గెలాక్సీ A16 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, WiFi 5, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications