Home
Mobile

6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 256GB స్టోరేజీ, 50MP కెమెరా 5G ఫోన్‌పై రూ.2500 డిస్కౌంట్‌..!

Samsung Galaxy A17 5G Smartphone : శాంసంగ్‌ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌ లను విడుదల చేసింది. A, F, M సిరీస్‌ లో అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో శాంసంగ్‌ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

రూ.2500 డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.2500 డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A17 5G

రూ.18999 ప్రారంభ ధరకే :
అంటే 8GB/256GB వేరియంట్‌ ను రూ.20999 ధరకే అందుబాటులో ఉంది. మిగిలిన రెండు వేరియంట్స్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20499 గా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్‌, బ్లూ, గ్రే కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ ఇన్ఫినిటీ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్ Exynos 1330 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది.

Samsung Galaxy A17 5G

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ లను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, VoLTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.3, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ సర్కిల్‌ టూ సెర్చ్‌, గూగుల్ జెమిని వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A17 5G Smartphone 256GB ROM variant gets Rs2500 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X