శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ఆండ్రాయిడ్ 16, ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి త్వరలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం శాంసంగ్ అనేక బడ్జెట్, ఎంట్రీ లెవల్ మోడల్స్ ను లాంచ్ చేసింది. దీంతోపాటు ప్రీమియం, మిడ్‌రేంజ్ హ్యాండ్‌సెట్ ను కూడా తీసుకొచ్చింది. అయితే త్వరలో A సిరీస్ నుంచి మరో ఫోన్ రానుంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ (Samsung galaxy A17 5G Smartphone) ఇప్పటికే అనేక యూరోపియన్ రిటైల్ వెబ్‌సైట్స్ లో కనిపించింది. దీంతోపాటు అనేక కీలక స్పెసిఫికేషన్ ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే ఇదే మోడల్ త్వరలో భారత్ మార్కెట్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ధర వివరాలు లీక్ అయ్యాయి.

ధర వివరాలు లీక్ :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను లీక్ చేశారు. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23499 గా ఉంటుందని అంచనా వేశారు.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు! :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 90Hz రీఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy A17 price for the Indian market.
— Abhishek Yadav (@yabhishekhd) August 14, 2025
6GB+128GB 💰 ₹18,999
8GB+128GB 💰 ₹20,499
8GB+256GB 💰 ₹23,499 pic.twitter.com/NXrVrGzj5s
ఈ గెలాక్సీ A17 5G హ్యాండ్‌సెట్ Exynos 1330 SoC చిప్‌సెట్ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 16 :
అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 7 పైన పనిచేసే అవకాశం ఉంది. మరియు 6 సంత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీపై కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ ఆగస్టు నెల చివరలోగా విడుదల కానుందని భావిస్తున్నారు. అయితే విడుదల సహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఇప్పటి వరకు శాంసంగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








