Home
Mobile

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5G ఫోన్‌!

Samsung Galaxy A17 5G Smartphone : భారత్ మార్కెట్‌ లో శాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ F70e స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఆకట్టుకొనే డిజైన్‌, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ వారం లోనే సేల్‌ ప్రారంభం కానుంది. అయితే గత సంవత్సరం ఆగస్టు చివరలో శాంసంగ్‌ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ కూడా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20498, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.23499 గా ఉంది. పాత ఫోన్‌ ను ఎక్స్ఛేంజీ ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ.1500 బోనస్‌ ను పొందవచ్చు.

Samsung galaxy A17 5G Smartphone

సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ :
శాంసంగ్‌ గెలాక్సీ A17 5G 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ ఇన్ఫినిటీ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్‌, బ్లూ, గ్రే కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ Exynos 1330 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ :
గెలాక్సీ A17 5G ఫోన్‌ కు వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13MP కెమెరా ఉంది. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ జెమిని లైవ్‌, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా శాంసంగ్‌ గెలాక్సీ A17 స్మార్ట్‌ఫోన్ 5G, 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.3, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

ఈ నెల 25 న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2026 జరగనుంది. ఈవెంట్‌లో అనేక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ సహా ఇయర్‌బడ్స్‌ సిరీస్ కూడా విడుదల కానుంది.

Best Mobiles in India

English summary
Samsung galaxy A17 5G Smartphone with 6 years of updates now under 20k price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X