బడ్జెట్ ధరలో 6 సంవత్సరాల అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరాలతో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ ను భారత్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధర సెగ్మెంట్ లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల OS అప్‌డేట్స్ ను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A17 5G Smartphone Launched) 6.7 అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Exynos 1330 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
ట్రిపుల్ కెమెరాలు :
ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో లెన్స్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, గూగుల్ జెమిని వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.3, వైఫై 5, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మా్ర్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23499 గా ఉంది.
శాంసంగ్ వెబ్‌సైట్‌లో SBI, HDFC బ్యాంకుల క్రెడిట్ కార్డుల లావాదేవీలు మరియు EMI కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. కేవలం శాంసంగ్ వెబ్‌సైట్ లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A17 5G Sale) ప్రస్తుతం శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








