Home
Mobile

Samsung Galaxy A20s,S10 Series ఫోన్‌ల మీద భారీ తగ్గింపు

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్ మూడు రోజుల క్రితం గెలాక్సీ S20 సిరీస్-గెలాక్సీ ఎస్20, ఎస్20+, ఎస్20 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇవి ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వకపోయినప్పటికీ వీటి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయినాయి. అయితే శాంసంగ్ సంస్థ తన అబిమానుల కోసం S10సిరీస్ ఫోన్‌లతో పాటుగా గెలాక్సీ A20s ఫోన్ మీద కూడా ధరల తగ్గింపును ప్రకటించింది.

గెలాక్సీ A20s తగ్గింపు ధరలు

గెలాక్సీ A20s తగ్గింపు ధరలు

శామ్సంగ్ గెలాక్సీ A20s కు ఇప్పుడు ఇండియాలో ధర తగ్గింపు లభించింది. ఐదు నెలల క్రితం లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు రూ.10,999 ప్రారంభ ధర వద్ద నుండి కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ A20s యొక్క 3GB ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.10,999 లకు మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ను రూ.12,999 ధర వద్ద ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు.

 

శామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ తగ్గింపు ధరలు

శామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ తగ్గింపు ధరలు

 స్మార్ట్ ఫోన్ మోడల్ అసలు ధర  ప్రస్తుత ధర  తగ్గింపు
 శాంసంగ్ గెలాక్సీ ఎస్10e  రూ.55,900  రూ.47,900  రూ.8,000
 శాంసంగ్ గెలాక్సీ ఎస్10  రూ.71,000  రూ.54,900  రూ.16,100
 శాంసంగ్ గెలాక్సీ ఎస్10+   రూ.79,000   రూ.61,900  రూ.17,100
తగ్గింపు పొందక ముందు ధరలు

తగ్గింపు పొందక ముందు ధరలు

తగ్గింపు పొందిన తరువాత కొత్త ధరలతో ఇప్పటికే దేశంలోని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గెలాక్సీ A20s బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ధర తగ్గింపుకు ముందు 3GB + 32GB వేరియంట్ రూ.11,999 లకు మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ రూ.13,999 ధరల వద్ద లభించేది. ఇటీవలే శామ్సంగ్ ఇండియాలో గెలాక్సీ A50, గెలాక్సీ A50s మరియు గెలాక్సీ M30 స్మార్ట్‌ఫోన్‌ల ధరలను కూడా తగ్గించింది.

 

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 7 ప్రో, వివో U20 మరియు రియల్‌మి 5 ప్రో వంటి వాటితో పోల్చినప్పుడు గెలాక్సీ A20s యొక్క ఫీచర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు రూ.12,000 కన్నా తక్కువకు లభిస్తాయి. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే గెలాక్సీ A20s 6.5-అంగుళాల హెచ్‌డి + స్క్రీన్‌ 720 x 1560 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. గెలాక్సీ M-సిరీస్ ఫోన్‌ల మాదిరిగా కాకుండా గెలాక్సీ A20s కు TFT డిస్‌ప్లే ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 చిప్‌సెట్ ఆధారంగా రన్ అవుతు 3GB / 4GB RAM మరియు 32GB / 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. మెమొరీని పెంచడం కోసం హ్యాండ్‌సెట్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

 

 

కెమెరా

గెలాక్సీ A20s యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 13MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 5MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరాలో OIS మద్దతు లేదు. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

 

 

కనెక్టివిటీ

స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా డ్యూయల్ 4G VoLTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ V 4.2, జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. చివరగా గెలాక్సీ A20s స్మార్ట్‌ఫోన్‌ 4000mAh బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A20s and S10 Series Price Droped in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X