తక్కువ ధరలో శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్!
Samsung Galaxy A26 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ మార్చి రెండో తేదీన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ A26 5G, గెలాక్సీ A56 5G, గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అయితే ఇటీవలే ఈ మోడళ్లపై భారీగా ధరను తగ్గించింది. గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే తాజాగా శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది.
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ కొత్త ర్యామ్ వేరియంట్‌ను (Samsung Galaxy A26 5G New Variant) కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో కూడా లాంచ్ చేశారు.

ప్రస్తుతం అత్యంత తక్కువ ధరలో :
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23499 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో 8GB/128GB వేరియంట్ ధర రూ.22999, 8GB/256GB వేరియంట్ ధర రూ.25999 కే లభిస్తోంది.
నాలుగు కలర్ వేరియంట్స్ :
అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు వరకు ఉంటుందో వెల్లడి కాలేదు. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. awesome బ్లాక్, awesome మింట్, awesome పీచ్, awesome వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. పంచ్ హోల్ కెమెరా డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 5nm Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు Mali G68 MP5 GPU చిప్‌సెట్ కూడా అమర్చి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో లెన్స్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
గెలాక్సీ A26 5G హ్యాండ్‌సెట్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. 5G, 4G VoLTE, బ్లూటూత్, Wi-Fi, NFC, USB-C వంటి ఫీచర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








