6 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 50MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే శాంసంగ్ 5G ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్
శాంసంగ్ గత నెలలో నిర్వహించిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ A56, A36, A26 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. గెలాక్సీ A56, గెలాక్సీ A36 ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత గెలాక్సీ A26 హ్యాండ్‌సెట్ (Samsung Galaxy A26 5G Smartphone) లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ మిడ్‌రేంజ్‌లో ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో గెలాక్సీ A26 హ్యాండ్‌సెట్ పై డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ధర వివరాలు :
భారత్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. శాంసంగ్ వెబ్‌సైట్‌లో HDFC బ్యాంకు కార్డుపై కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22999 గా ఉంటుంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ఎన్నిరోజులపాటు అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో అందుబాటులో ఉంది.
చిప్‌సెట్, OS :
గెలాక్సీ హ్యాండ్‌సెట్ ఇన్‌హౌస్ 5nm Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు Mali G68 MP5 GPU చిప్‌సెట్ కూడా కలిగి ఉంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది.
6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో లెన్స్‌లను కలిగి ఉంది. ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 5G, 4G LTE, బ్లూటూత్, Wi-Fi, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications








