Home
Mobile

BIS వెబ్‌సైట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి త్వరలో గెలాక్సీ A సిరీస్‌ ఫోన్‌ విడుదల కానుంది. తాజాగా గెలాక్సీ A26 5G హ్యాండ్‌సెట్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో (Samsung Galaxy A26 5G Smartphone) కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌లో త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ అనేక వివరాలు వెల్లడయ్యాయి.

శాంసంగ్‌ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (BIS) వెబ్‌సైట్‌లో లిస్టింగ్‌ అయింది. ఈ వెబ్‌సైట్‌లో SM-A266B/DS మోడల్‌ నంబర్‌తో కనిపించింది. ఈ వివరాలు మైస్మార్ట్‌ఫైస్‌ లో కనిపించాయి. 2023 డిసెంబర్‌లో విడుదల అయిన గెలాక్సీ A25 5G ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా గెలాక్సీ A26 మోడల్ లాంచ్ కానుందని తెలుస్తోంది.

samsung galaxy A26 5G smartphone

శాంసంగ్‌ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
గెలాక్సీ A26 5G హ్యాండ్‌సెట్ వివరాలు కొన్ని లీక్‌ అయ్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.64 అంగుళాలు లేదా 6.7 అంగుళాల పుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 209 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది.

త్వరలో విడుదల కానుందని భావిస్తున్న శాంసంగ్‌ గెలాక్సీ A26 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm Exynos 2400e చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం. ఈ శాంసంగ్‌ ఫోన్‌ కెమెరా, స్టోరేజీ, ధర సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్ వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల FHD సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్‌ Exynos 1280 చిప్‌సెట్ పనిచేస్తోంది. 50MP OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్, 2MP కెమెరాలను కలిగి ఉంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

త్వరలో శాంసంగ్‌ భారీ ఈవెంట్‌ :
జనవరి 22న తేదీన శాంసంగ్ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌ భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌ జరగనుంది. శాంసంగ్‌ న్యూస్‌రూం, samsung.com, శాంసంగ్‌ యూట్యూబ్ ద్వారా ఈవెంట్‌ లైవ్‌ చూడవచ్చు.

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో గెలాక్సీ S25 సిరీస్‌ను లాంచ్ కానుంది. సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. దీంతోపాటు గెలాక్సీ రింగ్‌ 2 ను ఆవిష్కరించే అవకాశం ఉంది. XR హెడ్‌సెట్‌ లాంచ్‌ చేసే అవకాశం ఉంది.

శాంసంగ్‌ భారత్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రీ బుకింగ్ అవకాశం కల్పించింది. దీని ద్వారా అదనపు ప్రయోజనాలను అందించనున్నట్లు పేర్కొంది. రూ.1999 చెల్లించి వీఐపీ పాస్‌ను పొందవచ్చని, దీంతో రూ.5000 వరకు ప్రయోజనాలను అందిస్తామని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy A26 5G smartphone listed on BIS website here are the expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X