శాంసంగ్ Galaxy A26, Galaxy A36 ఫోన్ల మధ్య తేడాలేంటి.. ఏది బెస్ట్ ఫోన్?
Galaxy A26 vs. Galaxy A36: శాంసంగ్ కంపెనీ ఇటీవల కాలంలో చాలా మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటిలో రెండు కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అవి Galaxy A26 5G, Galaxy A36 5G. చూడటానికి దాదాపు ఒకేలా ఉన్నా, వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. డిజైన్, పనితీరు, కెమెరా, బ్యాటరీ, డబ్బుకు తగ్గ విలువ విషయంలో ఏది బెటరో తెలుసుకుందాం.
* డిజైన్, బిల్డ్ క్వాలిటీ
రెండు ఫోన్ల ముందు వెనుక గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంది, పక్కన మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. Galaxy A26 కొంచెం లావుగా (7.7 మిమీ) బరువుగా (200 గ్రాములు) ఉంటుంది. గెలాక్సీ A36 మాత్రం సన్నగా (7.4 మిమీ), తేలికగా (195 గ్రాములు) ఉంటుంది.

A26 ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో, కింద గడ్డంలా కాస్త మందంగా ఉంటుంది. అదే A36 పంచ్-హోల్ డిస్‌ప్లేతో, చుట్టూ సన్నటి బెజెల్స్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. వెనుకవైపు రెండు ఫోన్లలోనూ నిలువుగా ఉండే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. గెలాక్సీ A26 అమేజింగ్ బ్లాక్, మింట్, వైట్, పీచ్ వంటి నాలుగు రంగుల్లో వస్తుంది.
గెలాక్సీ A36 మాత్రం లావెండర్, బ్లాక్, వైట్ రంగుల్లో గ్రేడియంట్ ఫినిష్‌తో లభిస్తుంది. దుమ్ము, నీళ్లలో పడినా ఏమీ కాకుండా IP67 రేటింగ్ కూడా రెండిటికీ ఉంది. ఇవి 1 మీటరు లోతులో 30 నిమిషాల వరకు ఏమీ కాదు. నీళ్ల దగ్గర తిరిగేవారికి, బయట సాహసాలు చేసే వారికి ఈ మొబైల్స్ ఉత్తమంగా నిలుస్తాయి.
* డిస్‌ప్లే, సెక్యూరిటీ
రెండు మోడళ్లలోనూ 6.7-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్, 2340 x 1080 రిజల్యూషన్ ఉంటుంది. కానీ, A36 డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా ఉంటుంది. మామూలుగానే 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది, బాగా వెలుతురులో అయితే 1900 నిట్స్ వరకు వెళ్తుంది. అంటే ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.
A26 మాత్రం 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అంతేకాదు, A36 చుట్టూ సన్నటి బెజెల్స్ ఉండటం వల్ల చూడటానికి ఇంకా బాగుంటుంది. సెక్యూరిటీ కోసం, A26 లో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. A36 లో మాత్రం స్క్రీన్ కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇది మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ.
* పనితీరు, స్టోరేజ్
గెలాక్సీ A26 ఫోన్‌లో శాంసంగ్ ఎక్సీనోస్ 1380 (5nm) చిప్‌సెట్ ఉంటుంది. ఇది రోజువారీ పనులకు బాగానే పనిచేస్తుంది కానీ, ఎక్కువ సేపు గేమ్స్ ఆడితే మాత్రం కాస్త స్లో అవుతుంది. ఇందులో 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఉంటుంది, కావాలంటే మైక్రో SD కార్డ్ (2TB వరకు) వాడొచ్చు.
గెలాక్సీ A36లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (4nm) చిప్‌సెట్ ఉంటుంది. ఇది A26 కంటే కొంచెం ఎక్కువ శక్తివంతమైనది, తక్కువ బ్యాటరీని వాడుకుంటుంది. ఇందులో 12GB RAM, 256GB స్టోరేజ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు.
రెండూ రోజువారీ పనులను చక్కగా చేస్తాయి, కానీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ విషయంలో A36 కొంచెం ముందుంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, రెండు ఫోన్లు శాంసంగ్ One UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి, ఇది Android 15 ఆధారంగా పనిచేస్తుంది. వీటితో పాటు ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి.
* ఫీచర్లు
వీటిలో "ఆసమ్ ఇంటెలిజెన్స్" ఫీచర్లు కూడా ఉన్నాయి, అవేంటంటే, సర్కిల్ టు సెర్చ్ (Circle to Search), ఆబ్జెక్ట్ ఎరేజర్ (Object Eraser), ఎడిట్ సజెషన్ (Edit Suggestion), ఫొటో రీమాస్టర్ (Photo Remaster), A36లో ఎక్కువ RAM (12GB వేరియంట్) ఉండటం వల్ల, పెద్ద పనులు చేసేటప్పుడు స్మూత్‌గా పనిచేస్తుంది.
* కెమెరా క్వాలిటీ
గెలాక్సీ A26లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ (120° వ్యూ యాంగిల్), 2MP మాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీ కెమెరా 13MP. Galaxy A36లో మాత్రం పెద్ద 50MP మెయిన్ సెన్సార్ (1/1.96″), 8MP అల్ట్రావైడ్ లెన్స్ (123° వ్యూ యాంగిల్), మంచి 5MP మాక్రో కెమెరా ఉంటాయి.
గెలాక్సీ 36 స్మార్ట్‌ఫోన్ లో మెయిన్ సెన్సార్ పెద్దది కాబట్టి, తక్కువ వెలుతురులో కూడా ఫొటోలు బాగా వస్తాయి. A36 ముందు, వెనుక కెమెరాలతో 4K 30fps వీడియోలు రికార్డ్ చేయొచ్చు. కంటెంట్ థియేటర్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. A26 ఫ్రంట్ కెమెరా మాత్రం 1080p వీడియోలకే పరిమితం.
* బ్యాటరీ, ఛార్జింగ్
రెండు ఫోన్లలోనూ 5,000mAh బ్యాటరీ ఉంటుంది. కానీ, A26 25W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, A36 మాత్రం 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. A36 లో పవర్ ఎఫిషియంట్ 4nm చిప్‌సెట్ (అంటే పవర్‌ను చాలా సమర్థవంతంగా వాడుకునే సామర్థ్యం గల ప్రాసెసర్) ఉండటం వల్ల, బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది.
* ధర, ఏది బెస్ట్
గెలాక్సీ A26 ధరలు రూ.24,999 (8GB+128GB), రూ.27,999 (8GB+256GB) నుంచి మొదలవుతాయి. గెలాక్సీ A36 ధరలు రూ.32,999 (8GB+128GB మరియు 8GB+256GB), రూ.35,999 (12GB+256GB) నుంచి మొదలవుతాయి. గెలాక్సీ A26 సాధారణంగా వాడుకునేవారికి మంచి ఆప్షన్.
అంటే రోజూ నెట్ వాడేవాళ్లు, సినిమాలు చూసేవాళ్లు, సోషల్ మీడియాలో ఎప్పుడూ మునిగి తేలేవాళ్లు, ఫోటోలు దిగేవాళ్లు, ఫోన్ కాల్స్ మాట్లాడేవాళ్లు అప్పుడప్పుడు కాస్త ఎడిటింగ్, లైట్ గేమింగ్ చేసుకునేవాళ్లకి Galaxy A26 ఫోన్ బాగా సెట్ అవుతుంది
ఇది మంచి పనితీరు, స్టోరేజ్ పెంచుకునే అవకాశం, మన్నికను అందిస్తుంది. కానీ, గెలాక్సీ A36 మాత్రం ఎక్కువ ధరను సమర్థించుకుంటుంది. ఎందుకంటే ఇది మంచి డిజైన్, బ్రైట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన కెమెరాలతో వస్తుంది. రోజులో కొద్ది గంటలపాటు గేమ్స్ ఆడే యూజర్లకు, ఎడిటింగ్ చేసుకునే క్రియేటర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








