సామ్‌సంగ్ కొత్త సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

గెలాక్సీ ఏ (Galaxy A) పేరుతో కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. గెలాక్సీ ఏ3, గెలాక్సీ ఏ5 పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్‌లను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ ఏ3తో పోలిస్తే గెలాక్సీ ఏ5 మెరుగైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.

సామ్‌సంగ్ కొత్త సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ ఏ5 ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 2,3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గెలాక్సీ ఏ3 ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.5జీబి ర్యామ్, 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ రెండు ఫోన్‌లు బ్లాక్, వైట్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతాయి. గెలాక్సీ ఏ5 ధర 380 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.24,038), ఏ3 ధర 287 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.18,155). ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌ల అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. 2015లో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy A3 and A5 Unveiled with Metal Body and Snapdragon 410 CPU. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot