256GB స్టోరేజీ, ట్రిపుల్ కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. ఫీచర్లు, ధర వివరాలు,
శాంసంగ్ తన A సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A34 5G ధరను (Samsung Galaxy A34 5G Smartphone Price Drop) తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్‌ను గత సంవత్సరం మార్చిలో భారత్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సహా మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. గరిష్ఠంగా ఈ స్మార్ట్‌ఫోన్ 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుత తగ్గింపు అనంతరం 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.24,499 కే కొనుగోలు చేయవచ్చు. అదే 256GB స్టోరేజీ ధర రూ.26,499 గా ఉంది.

యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా బల్క్ కొనుగోళ్లు చేస్తే మరిన్ని తగ్గింపు ధరలను పొందవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్ల ద్వారా కూడా తగ్గింపును పొందవచ్చు. ఈ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ సహా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లో ఈ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2340 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది. మరియు మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వైలెట్, లైమ్, సిల్వర్, గ్రాఫైట్ రంగుల్లో లభిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoC చిప్ సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ మరియు 256GB వరకు జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ మెటల్ కెమెరా డిజైన్‌తో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 48MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ లెన్స్, f/2.4 అపేచర్‌తో 5MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 13MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కలిగి ఉన్నాయి.
IP67 రేటింగ్‌తో స్పిల్, స్ప్లాష్ రక్షణను కలిగి ఉంటుంది. ఒక మీటర్ మంచినీళ్లలో మీటర్ లోతు వరకు 30నిమిషాలు పాటు ఉంచినా సక్రమంగానే పనిచేస్తుంది. డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫాం Knox.. శాంసంగ్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. దీంతోపాటు శాంసంగ్ వాలెట్ యాప్ ద్వారా సురక్షితంగా UPI పేమెంట్లను చేసుకోవచ్చు. ఈ వాలెట్ యూజర్లు డిజిటల్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను భద్రంగా దాచుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








