Home
Mobile

నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా డ్యామేజీ కాని శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.3000 తగ్గింపు..!!

శాంసంగ్‌ సంస్థ ఇటీవల కాలంలో తన స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గిస్తోంది. ఈ మధ్య కాలంలో అనేక మోడళ్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటన చేసింది. తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A34 5G) ధరను తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్ సిగ్నేచర్‌ డిజైన్‌ మరియు ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లను కలిగి ఉంది. మరియు 4 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్ల ఇస్తామని సంస్థ చెబుతోంది.

శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్ ధర : శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Smartphone Price Cut 2024) 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.27,499 గా ఉండేది. 8GB ర్యామ్ + 256GB వేరియంట్‌ ధర రూ.29499 గా ఉండేది. తాజాగా సంస్థ ఈ రెండు వేరియంట్లపై రూ.3000 చొప్పున తగ్గించింది.

Samsung Galaxy A34 5G smartphone received price cut

రూ.3000 ధర తగ్గింపుతో శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్‌ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.24,499 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే 8GB ర్యామ్ + 256GB వేరియంట్‌ను రూ.26,499 కు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్‌ స్టోర్లు, సహా ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాంలు సహా ఇతర స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్పెసిఫికేషన్లు..
ఈ శాంసంగ్‌ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను పొందుతుంది. మరియు మెరుగైన విజువల్‌ అనుభూతిని అందిస్తుంది.

30 నిమిషాలపాటు నీటిలో ఉన్నా.. : ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ మెటల్‌ కెమెరా డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు నాలుగు రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. వైలెట్‌, లైమ్‌, సిల్వర్‌, గ్రాఫైట్‌ రంగుల్లో లభిస్తుంది. మరియు IP67 రేటింగ్‌తో స్పిల్‌, స్ప్లాష్‌ రక్షణను కలిగి ఉంటుంది. ఒక మీటర్‌ మంచినీళ్లలో మీటర్‌ లోతు వరకు 30 నిమిషాలు పాటు ఉంచినా సక్రమంగానే పనిచేస్తుంది.

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 48MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, f/2.4 అపేచర్‌తో 5MP మ్యాక్రో లెన్స్‌ ను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.2 అపేచర్‌తో ముందు కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలను అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటాయి.

డిఫెన్స్ గ్రేడ్‌ సెక్యూరిటీ ప్లాట్‌ఫాం Knox.. శాంసంగ్‌ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. దీంతోపాటు శాంసంగ్‌ వాలెట్‌ యాప్‌ ద్వారా సురక్షితంగా UPI పేమెంట్లను చేసుకోవచ్చు. ఈ వాలెట్‌ యూజర్లు డిజిటల్‌ పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర పత్రాలను భద్రంగా దాచుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A34 5G smartphone price slashed by rs 3000 in india Feb 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X