ట్రిపుల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, పుల్ HD+ డిస్‌ప్లే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ శాంసంగ్ గత సంవత్సరం మార్చి నెలలో గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా సహా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు IP67 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో ధర రూ.రూ.30,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌తో రూ.5000 డిస్కౌంట్ తో (Samsung Galaxy A35 5G Price drop) అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల పూర్తి వివరాలు.
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ ధర :
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.30,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.25,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.28,999 కే సొంతం చేసుకోవచ్చు.

5 సంవత్సరాల వరకు సెక్యురిటీ అప్‌డేట్‌లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐస్ బ్లూ, లిలక్, నేవీ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గెలాక్సీ A35 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాలు FHD+ (1080*2340 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 ప్రాసెసర్ ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Mali G68 చిప్‌సెట్‌తో జత చేసి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత శాంసంగ్ One UI 6.1 OS ను కలిగి ఉంది. రెండు స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 13MP కెమెరాను అమర్చారు.
గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 6 ఫీచర్ లను కలిగి ఉంది. IP67 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో ఉంది. Knox 3.1 రక్షణను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







